టీడీపీ పార్టీ అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచీ ఆ పార్టీ అధినేత విచక్షణ కూడా కోల్పోయారంటూ వైసీపీ ప్రభుత్వం రోజు వారి చేస్తున్న విమర్శలు చూసిన చాలా మంది,  వైసీపీ కావాలనే చంద్రబాబు పై దుష్ప్రచారం చేస్తున్నారని భావించారు. అయినా  40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా అలా ఎందుకు చేస్తారని అనుకున్నారు. కానీ ఈ రోజు జరిగిన టీడీఎల్పీ మీటింగ్ లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , ఆయన పరిపాలనపై వెటకారం ప్రదర్శించిన వీడియోల తీరు చూసిన ప్రజలు, మేధావులు చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయానికి ఇదే సాక్ష్యం అంటున్నారు.. అసలేం జరిగిందంటే..

 

ఏపీ ప్రభుత్వాన్ని 151 మంది ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ఏపీ ప్రజల మనసు చొరగొంటున్నారు. జగన్ పాలనపై మంచి మార్కులు ఇస్తూ మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఉండాలని భావిస్తున్న ఏపీ ప్రజలు అందుకు తగ్గట్టుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ తీర్పు చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే  టీడీపీ పార్టీ అధినేత అండ్ కో జగన్ పై దుష్ప్రచారం మొదలు పెట్టేసింది. పచ్చ కామెర్ల వాళ్లకి లోకం అంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టుగా...

 

ఈరోజు జరిగిన టీడీఎల్పీ మీటింగ్ లో  ఏపీ ప్రజల ఆశీస్సులతో దూసుకు పోతున్న జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ దిగజారుడు రాజకీయానికి పాల్పడింది. కోట్లాది మంది ప్రజలు ఆశీర్వదించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పై వ్యంగ్యంగా వీడియోలు ప్రదర్శించింది. ఒకే చోట రాజధాని ఉండటం వలన ఏపీ అభివృద్ధి ఒకే చోట జరుగుతుందని భావించి మేధావులతో కమిటీలు వేసి, అన్ని ప్రాంతాల వారికి ఆమోద యోగ్యంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి సంకల్పించిన జగన్ మోహన్ రెడ్డి పాలన  తుగ్లక్ పాలన అంటూ , అలాగే హింసించే రాజు 23వ పుల కేసి అంటూ ఆయా సినిమాలకి సంభందించిన వీడియోలు ప్రదర్శించారు.

 

 

టీడీఎల్పీ లో ఇలా వీడియోలు ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు పగలబడి నవ్వుకుంటూ పొందిన ఆనందాన్ని చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. మొన్నటి ఎమ్మెల్సీల సభలో చంద్రబాబు సైగలతో మండలి చైర్మెన్ పై ఒత్తిడి తీసుకువచ్చిన క్లిప్పింగ్స్ చూసిన ఏపీ ప్రజలు ఇది చంద్రబాబేనా అంటూ ఆశ్చర్యపొతే, తాజాగా టీడీఎల్పీ లో చంద్రబాబు అండ్ కో లు కలిసి ప్రదర్శించిన వీడియోల విషయం బయటకి రావడంతో టీడీపీ ఇంతటి నీచ రాజకీయాలకి దిగజారిపోయిందా అంటూ చంద్రబాబు ని తిట్టిపోస్తున్నారట.




 

మరింత సమాచారం తెలుసుకోండి: