కేంద్రంలో అధికారంలో  ఉన్న బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌హారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ అయిన శివసేన తన శత్రువులైన కాంగ్రెస్​, ఎన్సీపీలతో కలిసి​ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకుంది. ముప్పయ్యేళ్లుగా బీజేపీతో ఉన్న స్నేహాన్ని శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే తన కుమారుడు ఆదిత్య కోసం వదిలేసుకున్నారు. కాంగ్రెస్​, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని శివసేన పవర్​లోకి రావడంపై ఆ పార్టీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని బీజేపీ క్యాష్​ చేసుకోవాలనుకుంటోందని స‌మాచారం. మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేన (ఎంఎన్​ఎస్​)​ పార్టీ అధినేత రాజ్‌థాక్రేతో దోస్తీ కుదుర్చుకుంటున్నార‌ని స‌మాచారం.

 

 

మహారాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఎంఎన్​ఎస్​ కొంతకాలంగా చాలా వెనుకబడిపోయింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకుని నాలుగో పెద్ద పార్టీ అయింది. మరో 24 స్ఠానాల్లో రెండో ప్లేస్​లో నిలబడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​–ఎన్సీపీ కూటమి 144 సీట్లతో అధికారంలోకి రాగా, శివసేన–బీజేపీ కూటమి 90 సీట్లు తెచ్చుకుని ప్రతిపక్షంలో కూర్చున్నాయి. ఎంఎన్​ఎస్​కి చాలా భవిష్యత్తు ఉందని అందరూ అనుకున్నారు. ముంబై నగరంలో ఆరు సీట్లు, నాసిక్​లో 3, థానే జిల్లాలో రెండు, ఫుణే, ఔరంగాబాద్​ల్లో ఒక్కొక్కటి ఎన్​ఎంఎస్​ ఖాతాలో పడ్డాయి. 2012 నాటికి 16 కార్పొరేషన్లకు గాను బృహన్​ ముంబై, నాసిక్​, కల్యాణ్​–దోంబీవాలీ, పుణే, జల్​గావ్​ మునిసిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో మంచి సత్తా చూపించింది. కానీ ఇదే ఊపు కొన‌సాగించ‌లేక‌పోయింది.

 

ఎంఎన్​ఎస్​ వల్ల ఇప్ప‌టికిప్పుడు బీజేపీకి ఒరిగేదేమీ లేదని ఆ పార్టీకి తెలుసు. మ‌హారాష్ట్రలో దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో బీజేపీ ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే రాజ్​ థాక్రేని తమతో కలుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చిందంటున్నారు. ఈ మేర‌కు ప‌రిణామాలు మారుతున్నాయి. ఈ నెల రెండోవారంలో ఎంఎన్​ఎస్ చీఫ్​ రాజ్​ థాక్రేతో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ భేటీ కావడం కూడా అలాంటిదే. కేవలం ఫ్రెండ్లీగానే కలిశామని ఫడ్నవీస్​ అన్నప్పటికీ, అస‌లు మ‌త‌ల‌బు వేరే ఉంటుందంటున్నారు. తన పెదనాన్న బాల్​ థాక్రే 94వ జయంతి వేడుకల సందర్భంలో రాజ్​ తన రాజకీయ ఎత్తుగడల్ని బయటపెట్టారు. ముంబై శివారులోని గోరేగావ్​లో జరిగిన సభలో.. శివసేన ఫౌండర్​ బాలా సాహెబ్​ నమ్మిన మరాఠా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అంతకు ముందు జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​లో తమ పార్టీకి కొత్త జెండాని విడుదల చేశారు. కాషాయ జెండాలో శివాజీ మహారాజ్​ ‘రాజముద్ర’ని చేర్చారు. పార్టీని పూర్తిగా కాషాయీకరణ చేయడమేకాక, కేంద్ర ప్రభుత్వ సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ (సీఏఏ), నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజన్స్​(ఎన్నార్సీ)లకు మద్దతు ప్రకటించడంతో... ఢిల్లీలో ఎన్నికలు ముగిశాక మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు ఖాయమయ్యేలా ఉన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: