ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వికేంద్రీకరణ బిల్లుకు చుక్కెదురైన  విషయం తెలిసిందే. శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు సహా శాసనమండలి చైర్మన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి శాసన మండలి రద్దుపై  నిర్ణయించారు . ఇక తాజాగా దీనిపై స్పందించిన టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీని స్పీకర్ తమ్మినేని సీతారాం నడుపుతున్నారా... లేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నడుపుతున్నారా  తమకు మాత్రం అర్థం కావట్లేదు అంటూ  ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై సెటైర్లు వేశారు. సమావేశం జరుగుతున్న సమయంలో  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాం నవ్వుకుంటూ ఉంటారు ఉంటూ తెలిపారు . 

 

 అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు... ఇక రేపటి అసెంబ్లీ సమావేశానికి వెళ్లి లాభం ఏంటి అంటూ ప్రశ్నించారు. శాసనమండలిని రద్దు చేయాలని జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీర్మానం చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు అంటూ విమర్శించారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో శాసన మండలి రద్దు చేయాలని పునరుద్ధరించాలని కోరుతూ బోలెడు  కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో శాసనమండలిని రద్దు  చేయడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టిందని. శాసనమండలిని పునరుద్ధరించడానికి మాత్రం 22 ఏళ్లు పట్టింది  అంటూ తెలిపారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

 

 

 శాసన మండలి రద్దు ఊరికే కాదన్నా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ... మండలి రద్దు  చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్  ఉంటుంది అని తెలిపారు. శాసన మండలి రద్దు తీర్మానం పార్లమెంటులో ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం చేసేంతవరకు మండలి కొనసాగుతూనే ఉంటుంది అని తెలిపారు. శాసనమండలి చైర్మన్ శాసనమండలి సభ్యులు అందరూ అలాగే కొనసాగుతారని... శాసన మండలి రద్దు తీర్మానం రాష్ట్రపతి ఆమోదం పొందే  వరకు వారి  హక్కులను ఎవరూ హరించలేరు అంటూ వివరించారు. రాష్ట్రపతి అనుమతి లభించే వరకు శాసనమండలిని రద్దు చేయడం వైసీపీ ప్రభుత్వం తరం కాదు అంటూ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: