మనిషి ప్రకృతిని నాశనం చేస్తూ, నా అభివృద్ధి ముందు ఈ ప్రకృతి ఒక లెక్క అనే విధంగా  జీవిస్తున్నాడు. తన ఎదుగుదలను కోరుకుంటూ, తాను ఎదగడానికి ఎన్నో దారుణాలు చేస్తున్నాడు. ఒక వైపు కలుషితమైన వాతావరణం. ఇష్టారీతిగా పుడమికి హని చేస్తున్న మనుషులు, ఎక్కడ చూడూ పరిశోధనల పేరుతో, అభివృద్ధి పేరుతో, తనకు ఈ ప్రకృతి మీద సర్వ హక్కులున్నట్లుగా రెచ్చిపోతున్నాడు. అంటే ఒక రకంగా తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కుంటున్నాడు అల్పబుద్ధి గల మానవుడు.

 

 

ఎంతగా అభివృద్ది సాధించిన ప్రకృతి కన్నెర్ర చేస్తే దాని ముందు ఓడిపోక తప్పదు. అని ప్రతిసారి నిరూపించ బడుతున్న కొంత కూడా ముందు జాగ్రత్తగా ఆలోచించడం లేదు. ఇప్పటికే ప్రపంచంలో ఒక చోట రోగాలు, మరో చోట వరదలు, భూకంపాలు, వేడి గాలులూ ఇలా అస్తవ్యస్తంగా మారిన ఈ ప్రకృతి వల్ల మనిషికి ఏనాడైనా భారీ ముప్పు తప్పదు. అసలు మానవుని మనుగడ పూర్తిగా నశించక మానదు. అందుకు ఉదాహరణగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రకృతి వైపరిత్యాలను చెప్పవచ్చూ.

 

 

ఇకపోతే తాజాగా తూర్పు టర్కీని భారీ భూకంపం వణికించింది. ఎలాజిగ్, మలాట్యా ప్రావిన్స్‌ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం ధాటికి 22 మంది మృతిచెందగా.. 1,015 మంది గాయపడ్డారు. ఇక ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదవగా, ఈ భూకంప కేంద్రాన్ని, సివ్రిస్‌ నగరంలో చిన్న సరస్సు సమీపంలో గుర్తించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది.

 

 

తొలుత సివ్రిస్‌లో భూమి కంపించిందని టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఇకపోతే ఈ భూకంపం దాటికీ పలు ఇళ్లు నేలకూలాయి. ఘటనా స్థలాలకు చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టి ఎలాజిగ్‌లో శిథిలాల్లో చిక్కుకున్న 39 మందిని సురక్షితంగా కాపాడారు. ఇక ఈ సహాయక చర్యల్లో దాదాపు 2 వేల మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నరని అధికారులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: