ఒక‌ప్పుడు జంతువును చూడాలంటే జూపార్క్‌ల‌కు వెళ్ళేవాళ్ళం.  కానీ ఇప్పుడు ఎక్క‌డా చూడ‌టానికి కూడా జంతువులు చాలా త‌క్కువ‌యిపోయాయి అనే చెప్పాలి. ఇటీవ‌లే ఆస్ట్రేలియాలో కార్చిచ్చు  వ‌ల్ల కోట్లాది జంతువులు ద‌హించి పోయాయి. అలాగే కోట్ల కొద్ది జంతువులు గాయ‌ప‌డ్డాయి. విలువైన జంతు సంపద మంటల్లో మాడి మసైపోయాయి. వాటి  ప్రాణాలను అవి కాపాడుకోలేక పాపం మూగ‌ జీవులు అలాగే మంటల్లో ఉండిపోయాయి. మనం అంటే మనుషులం, కాపాడమని అరుస్తాం. మరి వాటిని ఎవరు కాపాడతారు…? కాపాడితే మనం లేకపోతే ఆ మంటల్లో అవి దహనం అయిపోవడమే పాపం వాటి ప‌ని అంత‌కుమంచి అవి ఇంకేం చెయ్య‌గ‌ల‌వు నోరు తెరిచి అర‌వ‌లేవు. బాధ‌క‌లిగితే చెప్ప‌లేవు. 

 

మంట‌ల్లో హాహాకారాల‌తో మండిపోతున్న కోట్లాది అడ‌వి జంతువులను పోగొట్టుకున్నాయి. పెద్ద జంతువులు వాటి బిడ్డ‌లు కూడా ఆ మంట‌లు  కాలిపోయాయి. కొన్ని బిడ్డ‌లు త‌మ త‌ల్లుల‌ను పోగొట్టుకుని రోదిస్తున్నాయి. ఈ సంద‌ర్భంలో ఒక చిన్న న‌క్క‌పిల్ల దాని త‌ల్లి త‌నాన్ని చాటుకుంది. ఆస్ట్రేలియాలో  కంగారు ఐలాండ్‌లో జంతువులు, వాటిపిల్ల‌లు, త‌ల్లులు అన్నీ ఆ మంట‌ల ధాటికి  ద‌గ్ధ‌మ‌య్యాయి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఎలుగు బంట్లు ప‌రిస్థితి వ‌ర్ణ‌నాతీతం అని చెప్పాలి. 


ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక న‌క్క  ఎలుగుబంటి పిల్ల‌ను ఏమాత్రం కూడా తేడా లేకుండా పాలు ఇచ్చి పిల్ల‌ల‌ను కాపాడింది. నోరు లేని జీవాలైనా స‌రే ఎంతో ఆలోచ‌నాత్మ‌క‌త‌తో త‌న‌త‌ల్లి త‌నాన్ని చాటుకున్నాయి. ఈ వీడియో వైర‌ల్ కాగా సోష‌ల్ మీడియాలో ఇది చూసిన నెటిజ‌న్లు ప్ర‌పంచం మొత్తం స‌లాం కొడుతున్నారు.  చ అమ్మ లక్షణం జంతువుకి మనుషులకు ఒకరకంగా ఉండదు అని, అమ్మకు ఆకలి తెలుసు అని, ఆ నక్క ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చిందని అంటున్నారు.  దీన్ని సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ చేసి  ఆ న‌క్క‌కు కామెంట్ల మీద కామెట్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: