ఏపీలో అమరావతిని రాజధానిగా ప్రకటించారే గాని ఇది రాజధానికి అనువైన ప్రదేశమా కాదా అని అప్పటి ప్రభుత్వం తగిన విధంగా పరిశీలించినట్లుగా కనబడటం లేదు. అంత హడావుడిగా ఇదే రాజధాని అని ఫిక్సయి పోయి ఎందరో రైతులను అన్యాయం చేసారని అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇకపోతే ఇప్పటికే అమరావతి రాజధానికి అంత్యత సురక్షితమైనా ప్రదేశం కాదని, ఇక్కడ రాజధాని నిర్మించడం వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువని ఎందరో నిపుణులు హెచ్చరిస్తున్నా టీడీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి ముందుకు వెళ్లిందనే వాదనలు ఇప్పుడు జరుగుతుండగా, తాజాగా అనుకోని సంఘటన జరిగింది.

 

 

అదేమంటే అమరావతి భద్రత, వరద ముంపు ప్రభావం గురించి ఒక వైపు చర్చలు జరుగుతూండగానే శనివారం రాత్రి భూకంపం సంభవించింది. శనివారం రాత్రి సూర్యాపేట జిల్లా, నల్గొండ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో తెల్లవారుజామున 2.37 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై ఇది. 4.6 గా నమోదైంది. ఈ భూకంపానికి కేంద్రం సూర్యాపేట్ జిల్లాలోని వెలుటూరుగా ఎన్ జీ ఆర్ ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై అధ్యయనాలు చేయబోతున్నట్టు ఎన్ జీ ఆర్ ఐ చీఫ్ సైంటిస్ట్ డా. శ్రీనగేశ్ చెప్పారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సైతం భూకంపం సంభవించే ప్రాంతంగా గుర్తింపులో ఉన్న నేపథ్యంలో తాజా భూకంపం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

 

 

ఇక ఈ భూకంపం రావడానికి వెల్లటూరు వద్ద ఒక భూగర్భ పలక లో కదలిక  కారణం దీనివల్ల ఈ భూకంపం సంభవించిందని, భూకంప కేంద్రం కృష్ణా నదీ గర్భంలో ఉందని డా. శ్రీనగేశ్ చెప్పారు. అంతే కాకుండా అమరావతి కూడా కృష్ణా నది ఒడ్డునే ఉందన్న విషయం అందరికి తెలిసిందే. అందువల్ల ఇక్కడ భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అదీ గాకుండా తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర ప్రాంతంలోనే భూకంపాలు ఎక్కువగా  వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

 

దీనిబట్టి అర్ధం అయ్యిందేమిటంటే అమరావతి రాజధానిగా అసలు పనికి రాదు. ఒకవేళ ఇక్కడే రాజధాని నిర్మించాలను కుంటే, అందులో భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలంటే వాస్తవంగా అయ్యే ఖర్చు కంటే పది రెట్లు అధికంగా ఖర్చు అవుతుందని... దాని కారణంగా రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుంది. ఇక భూకంప ప్రమాదాల విషయంలో అమరావతితో పోల్చుకుంటే విశాఖ చాలా సురక్షితం అని కొందరు అభిప్రాయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: