నాటు వైద్యాల‌కు ఔష‌ధంగా ప‌నిచేస్త‌ది వ‌యాగ్రా. దీని గురించి నేటి త‌రానికి చాలా మందికి తెలియ‌దు. అయితే  ప్ర‌స్తుతం దీని ధ‌ర వింటే తారెత్తిపోవ‌ల్సిందే. బంగారంతో స‌మానంగా కొలుస్తారు దీని ధ‌ర‌ని. అంత విలువైన‌ది వ‌యాగ్రా. ప్ర‌స్తుతం దీని ధ‌ర 25 నుంచి 100 రూపాయ‌లు. ఇదేం వయాగ్రానో ఏమో గానీ తులం 7000 రూపాయలు కిలో 70లక్షలట.. దీని పేరు యర్సగుంబా. ఇది ఎక్కువ‌గా భారత్‌, నేపాల్‌, భూటాన్‌, టిబెట్లోని హిమాలయ ప్రాంతాల్లో అధికంగా దొరుకుతుంది. అందుకే దీన్ని హిమాలయన్‌ వయాగ్రా అని కూడా అంటారు.

 

ఇది ఎక్కువ‌గా నాటు వైద్యాల‌కు వాడ‌తారు. ఈ యర్సగుంబా మ‌గ‌వారిలో ఉండే నపుంసకత్వానికి, కేన్సర్‌, ఆస్తమాలకు మంచి ఔషధంగా పనిచేస్తుందని నాటు వైద్యుల  తెలుపుతున్నారు. గొంగలి పురుగే యర్సగుంబాగా మారుతుంది. నేలలో ఉండే ఒకరకమైన ఫంగస్ ఈ గొంగ‌లి పురుగుకి సోకి చనిపోతే గొంగలి పురుగునే యర్సగుంబా అని అంటారు. దీన్ని హిమాలయన్‌ వయాగ్రా, నేచురల్‌ వయాగ్రా అని కూడా అంటారు.

 

ఇది హిమాలయా ప్రాంతంలో ఎక్కువ‌గా లభిస్తుంది, అక్కడ ఉండే కొండజాతి ప్రజలు ఈ యర్సగుంబాలను వెదికే పనిలో పడతారు. ఇది ఎక్కువ‌గా మే, జూన్‌ నెలల్లో వేలాదిమంది ప్రజలు యర్సగుంబా కోసం వేటలో ఉంటారు. వారి వార్షికాదాయంలో 56 శాతం యర్సగుంబా అమ్మగా వచ్చినవే కావడం చాలా గమనార్హం. ఒక్కో యర్సగుంబా వేల 250-300 రూపాయలు వరకు విక్రయిస్తారు. గతంలో ఒక్కోరోజు కనీసం 100 యర్సగుంబాలు దొరికేవని, ఇప్పుడు రోజుకు క‌నీసం 2 నుండి 20 దొరకడం కూడా చాలా కష్టంగా మారిపోయింద‌ని అక్కడి వారు చెబుతున్నారు. మారుతున్న వాతావరణం, భూతాపం వల్ల యర్సగుంబాల లభ్యత తగ్గిపోతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదిలా ఉంటే ఏదైనా అధికంగా దొరుకుతుంది క‌దా అని ఒకేసారి తీసుకున్నా అది ల‌భ్యం అనేది త‌గ్గిపోతుంది. 


ఇక ఇది దొర‌కాలంటే మాత్రం అంత తేలియైన ప‌నేమి కాదు. యర్సగుంబా వేట అంటే మామూలు విషయం కాదు, ఇవి 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. కానీ అంత ఎత్తులో వీటిని సేకరించడం ప్రాణాలను ప‌ణ్ణంగా పెట్ట‌డ‌మే. చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి హిమాలయ కొండ చరియలు విరిగి పడటం లాంటివి కూడా ఎక్కువ‌గా జరుగుతుంటాయి. ఉన్నట్టుండి వర్షం కురవటం వల్ల అక్కడ చిక్కుకున్న సంద‌ర్భాలూ అనేక‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: