మండలి రద్దును అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నారా ?, ఈ మేరకు కేంద్ర పెద్దలకు ఫోన్ చేసి, మండలి రద్దు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ కు   నివేదించే బిల్లును కనీసం రెండేళ్లపాటైన అడ్డుకోవాలని కోరుతున్నారా ?? అంటే అవుననే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు . మండలి రద్దు కాకుండా అడ్డుకుంటానని , టీడీపీ ఎమ్మెల్సీలతో చంద్రబాబు  చెప్పినట్లుగా ఆ పార్టీ ఎమ్మెల్సీ లు చెబుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు .  

 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో, తమ పార్టీ చెందిన ఎమ్మెల్సీల ముందు  స్పీకర్ ఆన్ చేసి చంద్రబాబు   ఫోన్ మాట్లాడినట్టుగా  , మండలి రద్దు నిర్ణయాన్ని కనీసం రెండేళ్లు అడ్డుకోవాలని బాబు కోరగా , ఏడాది మాత్రం అడ్డుకోగలనని అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా  ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు  . అమిత్ షా మీతో లైన్ లోకి వచ్చి ఫోన్ ఎందుకు మాట్లాడుతారని టీడీపీ ఎమ్మెల్సీ లే  బాబును ప్రశ్నించగా  సమాధానం చెప్పలేకపోయారట ... అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ముక్తాయింపునిచ్చారు . శాసనమండలిలో ప్రస్తుతం టీడీపీ కి మెజార్టీ ఉండడంతో , ప్రభుత్వం ప్రతిపాదించిన పలు బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది . ఇదే విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం రుచించడం లేదు .

 

అందుకే ఏకంగా శాసనమండలిని రద్దు చేయాలని  భావిస్తున్నారు . దీనితో  అసెంబ్లీ లో చేసే ప్రతిపాదనలే  ఫైనల్ కానున్నాయి . అసెంబ్లీలో తమకు తిరుగులేని మెజార్టీ ఉండడంతో , విపక్షం తాము ప్రతిపాదించే బిల్లులను అడ్డుకునే సమస్యే ఉండదని ఆయన యోచిస్తున్నారు . అయితే ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు  ప్రతిపాదించినా   , పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందేందుకు  ఎంత సమయం పట్టనుందనే దానిపై స్పష్టత లేకుండా పోయింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: