భూకంపలు ప్రజలను వణికించేస్తున్నాయ్.. ఒక్కసారిగా భయపెట్టేస్తున్నాయ్.. అప్పుడెప్పుడో ఇలా భూకంపం పేరు వరుసగా విన్నాం. అలాంటి మనం మళ్ళి ఇప్పుడు ఈ భూకంపం గురించి వినడం ఏంటి? అది కూడా వరుసగా.. మొన్నటికి మొన్న టర్కీలో భూకంపం వచ్చింది.. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో వచ్చింది.. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. 

 

నిజానికి నిన్న శనివారం రాత్రి అర్ధరాత్రి భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా హైటెన్షన్ పడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని హైదరాబాద్ ప్రజలు ఇంటి నుండి ఒక్కసారిగా బయటకు వచ్చారు. అయితే ఈ భూకంపం ధాటికి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.     

 

అయితే నిన్న ఒక్క రాత్రే దాదాపుగా 11 సార్లు భూమి కంపించింది. ఇది రెక్టర్ స్కేల్ పై 4.6 గా నమోదైంది. పులిచింతల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమిలో కదలికలు ఏర్పడ్డాయని, దాని ప్రభావం కారణంగానే భూమి కంపించినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు అంత భయానికి గురయ్యారు.. అయితే ఒక్క హైదరాబాద్ ఏ కాదు.. తెలంగాణలో పలు ప్రాంతాల్లో.. 

 

ఆంధ్రాలో విజయవాడలో పలు ప్రాంతాల్లో ఈ భూకంపం వచ్చింది. అయితే ఈ రెండు తెలుగురాష్ట్రల్లో మళ్ళి భూమి కంపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే, ప్రమాదం స్థాయి ఎక్కువగా ఉండచ్చు.. ఉండకపోవచ్చు అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ప్రస్తుతం ఈ భూకంపం కారణంగా ఏ ప్రమాదం లేదని.. 

 

కానీ మళ్ళి వస్తే చెప్పలేం అని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. భూకంపం వస్తే వెంటనే ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లడమే మంచిది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి.. భూకంపం వచ్చింది అంటే వెంటనే ఇంటి నుండి పరిగెత్తడం చెయ్యండి. అప్పుడే ప్రాణాలను దక్కించుకోగలరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: