ప్రస్తుత రోజుల్లో కుటుంబాన్ని నెట్టుకు రావటానికి భర్త స్థానంలో ఉన్న వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచమంతా డబ్బు మదంతో లేని జీవితాన్ని ఉన్నట్టుగా ఎదుటి వ్యక్తుల కోసం బతుకుతూ టెక్నాలజీ ప్రపంచంలో బతుకుతూ వాస్తవ జీవితాన్ని అనుభవించలేక ఒక పక్క పేదవాడు మరో పక్క ధనవంతులు కూడా కాలగర్భంలో ప్రస్తుత రోజుల్లో కలసి పోతున్నారు. మేటర్ లోకి వెళితే ఇటీవల బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య చేసుకోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. చనిపోయే ముందు తన తండ్రికి రాసిన లెటర్ వాటిలో ఉన్న అక్షరాలు అందరిని కలచివేశాయి. నాన్న అప్పులు వసూలు చేసుకుని ప్రశాంతంగా బ్రతకండి నా భార్యకు రెండో వివాహం చేయండి అంటూ స్వయంగా తండ్రికి కొడుకు సూసైడ్ లెటర్ రాయడం తో తండ్రి హృదయం కాకా వికాలమయ్యింది.

 

వివరాల్లోకి వెళితే ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన చిత్తలూరి శ్రవణ్‌ కుమార్‌, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌ గా వర్క్ చేస్తున్నాడు. గత సంవత్సరం ఇతనికి సూర్యాపేటకు చెందిన అమ్మాయి హరిత అనే యువతితో వివాహం జరిగింది. దీంతో దంపతులు ఇద్దరు ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాగా శ్రవణ్ కుమార్ కు ఆర్థిక సమస్యలు ఉండటంతో మానసికంగా కుంగిపోయిన శ్రావణ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయటంతో దీన్ని గమనించిన హారతి భర్తని ఆస్పత్రికి తరలించగా...శ్రావణ్ ఆరోగ్య పరిస్థితి చాలా డేంజరస్ గా ఉండటంతో ...సదరు ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

దీంతో సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా శ్రవణ్‌ ఓ సూసైడ్‌ నోట్‌ రాశాడు. అందులో గతంలో ఇచ్చిన అప్పులను వసూలు చేసుకోవాలని, అందుకు తన స్నేహితులు సహకరించాలని ఈ లేఖలో శ్రవణ్ కోరాడు. తనకు ఎండో డబ్బులు రావాల్సి వున్నాయని, వాటితో అంత్యక్రియలు చేయాలని, తన భార్యకు రెండో వివాహం చేయాలని కోరాడు. దీంతో లెటర్ లో ఉన్న మేటర్ తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: