మండలి రద్దు ప్రతిపాదన విషయంలో జగన్ సన్నిహితుడు సలహాదారుడు ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి 17 మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీలు పరిస్థితి కూడా ఉందని స్పష్టం చేశారు. వాళ్లను మా పార్టీలోకి తీసుకుని మేము ఏం చేయాలని మాట్లాడుతూ కోట్లు పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మరియు ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం వైసీపీ పార్టీ తెలియదని డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయాల్సిన కర్మ వైయస్ జగన్ కి లేదని తెలిపారు. నవ తరం యువతరం నాయకుడు సీఎం జగన్ అని అంతరించిపోయే నాయకుడు చంద్రబాబు నాయుడు అని సజ్జల పేర్కొన్నారు.

 

పార్టీ కార్యాలయంలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి…’శాసన మండలి రద్దు ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అన్నివర్గాల సలహాలు తీసుకుంటే మంచిదని టైం ఇచ్చాం..కానీ ఎల్లో మీడియా ఆగడాలకు అంతు లేదు మండలిని ఎవరు తక్కువ చేయడం లేదు. 151 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని నిర్ణయాలతో సీఎం జగన్ ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. మండలి లో ఉన్న మెజార్టీతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు చంద్రబాబు అడ్డుపడుతున్నారు అని రామకృష్ణారెడ్డి శాసనమండలిలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్ అయ్యారు.

 

రాజధానిని గ్రాఫిక్స్ లో అద్భుతంగా చూపించినట్లు మండలిని తమ చేతిలో ఉందని తాము ఏదైనా చేయగలమని తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజలను భ్రమలు కల్పించే విధంగా వ్యవహరిస్తున్నారని చైర్మన్ ని ప్రభావితం చేసి దారుణమైన నీచమైన రాజకీయాలకు చంద్రబాబు తెగ పడ్డారని హీనంగా వ్యవహరించారని..చంద్రబాబు గ్యాలరీ లో కూర్చుని మరి చైర్మన్ ని నియంత్రించడం దుర్మార్గమైన చర్య అని ఇటువంటి రాజకీయాలు చేయబట్టే రాజధాని ప్రాంతంలో నారా లోకేష్ ఓడిపోయాను అని రామకృష్ణ రెడ్డి పేర్కొన్నారు.

 

ఏపీ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి ముందుకు జగన్ వెళుతున్నారని... ఎదురీదడం సీఎం జగన్‌ లక్షణం. ఆయన మరోసారి ప్రజలతో మమేకం కావాలనుకుంటున్నారు. నిజాయితీ, నిబద్ధత ఆయన నైజం. మనీ, మీడియా, మ్యానిప్యులేషన్‌ ఇవి చంద్రబాబు లక్షణాలు. ప్రభుత్వాన్ని, వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం చంద్రబాబు నైజం. ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం....అంటూ చంద్రబాబు -జగన్ మధ్య  ఉన్న తేడా గురించి ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణా రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: