ప్రపంచ దేశాలల్లో ఉగ్రవాద దేశంగా పేరుమోసిన పాకిస్తాన్ చేయని దారుణాలు లేవు. మనుషుల ప్రాణాలను గాల్లో కలిపి వేయడంలో ఇక్కడి ఉగ్రవాదులు ముందు వరుసలో ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా మనుషులకు మానవత్వం, ప్రేమ, పాప పుణ్యాలు, దయ, జాలి ఇవేవి లేకుండా కఠినాత్ములుగా తయారు చేయడానికి ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించే దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క పాకిస్తాన్ అనే చెప్పవచ్చూ.

 

 

ఇన్ని పాపాలు చేస్తు తాము సాధించిన అభివృద్ది ఏదైనా ఉందా అంటే ఏం లేదు. తన మూర్ఖత్వాని తానే బలి అయినట్లుగా, తన పతనానికి తానే గోతులు తీసుకుంది. దాని ఫలితంగా ఇప్పుడు ఈ దేశ ఆర్ధిక వ్యవస్ద పూర్తిగా దిగజారిపోయింది. అందుకు నిదర్శనం. కనీసం ఆదేశ  ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ దగ్గర, ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్ వెళ్లేందుకు డబ్బులు కూడా లేవట. తాజాగా తన స్నేహితులందరు తలా ఇంత అని చందాలు వేసుకుని దావోస్ కు పంపిస్తున్నారట.

 

 

ఇకపోతే ప్రస్తుత పరిస్దితుల్లో ఇమ్రాన్ దావోస్ వెళ్లేందుకు అవసరమయ్యే ఖర్చులు ప్రభుత్వం భరించలేని స్థితిలో ఉన్నందున ఇద్దరు స్నేహితులైన వ్యాపారవేత్తలు షెహగల్, ఇమ్రాన్ చౌదరి ఆ ఖర్చులు భరించినట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా ఈ సిగ్గులేని విషయాన్ని ప్రపంచానికంత తెలియాలని దావోస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు.

 

 

ఇక ఇక్కడ రెండు రాత్రులు గడిపేందుకు అయిన 450000 డాలర్లు ఖర్చును మా ప్రభుత్వం మీద భారం వేయలేనన్నారు. పాక్ ఆర్థిక పరిస్థితి వల్ల విదేశీ పర్యటనలపై నియంత్రణ ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఒక దేశ ప్రధానమంత్రి అధికారిక పర్యటనకు ప్రైవేటు వ్యక్తులు ఖర్చు పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 

 

దీని బట్టి, ఏంటంటే ఆ దేశ ఆర్ధిక పరిస్దితి ఎంతకు దిగజారిందో అనే విషయం సృష్టంగా తెలుస్తుంది. మరి తన దేశంలోని ఉగ్రవాదాన్ని పోషించడం మానేసి సక్రమంగా జీవించడం అలవాటు చేస్తే మిగతా దేశాల్లా గౌరవంగా బ్రతక వచ్చు కదా. అడుక్కుతినే బ్రతుకుకంటే ఇదే మేలుకదా అని ఈ విషయం తెలిసిన కొన్ని దేశాల ప్రజలు అనుకుంటున్నారట..  

మరింత సమాచారం తెలుసుకోండి: