కరుణ వైరస్ ఇప్పుడు అందరిని బెంబేలెత్తిస్తున్నది. కొంచెం జ్వరం జలుబు వచ్చిన కరోనా వైరస్ సోకింది అని  భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చైనాలో మొదలైన కరోనా  వైరస్ క్రమక్రమంగా పలు దేశాలకు వ్యాప్తి చెందుతుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ వ్యాప్తి పై తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్న మొన్నటి వరకు మాయదారి స్వైన్ ఫ్లూతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీయడానికి మరో వైరస్ సిద్ధమైపోయింది. కరోనా  వైరస్ నగరానికి వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం కరోనా  వైరస్ హైదరాబాద్లో కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి చైనా కు వెళ్లి వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారిలో తాజాగా ఫీవర్ జలుబుకు సంబంధించి మూడు కేసులు ఆస్పత్రికి వచ్చాయి... దీంతో అలర్ట్ అయిపోయిన వైద్యులు వారికి ఒక ప్రత్యేక వార్డును కేటాయించారు. 

 

 

 వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ కు చెందిన 25 ఏళ్ల యువకుడు తాజాగా చైనా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చైనాలో కరోనా  వైరస్ యువకునికి ప్రబలినట్లు... నల్లకుంటలోని ఓ  ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు కరోనా వైరస్  సోకినట్లు గా అనుమానించి అతనికి ప్రత్యేక వార్డులో  చికిత్స అందిస్తున్నారు. ఇదిల  ఉంటే ఆదివారం మధ్యాహ్నం మరో రెండు అనుమానిత కరోనా  ప్రబలిన కేసులు కూడా వచ్చాయి. ఇక ఆసుపత్రికి వచ్చిన ముగ్గురున్నీ ఐసోలేటెడ్ వార్డులో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. వారికి కరోనా వైరస్ సోకి ఉండవచ్చు అనే అనుమానంతో ఇప్పటికే వారి నుండి నమూనాలు సేకరించి పూణే ల్యాబ్ కి  పంపించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. 

 

 

 అయితే ఆసుపత్రిలో ఉన్నవారు కరోనా వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని చైనా నుంచి వచ్చినవారు కాబట్టి కరుణ వైరస్తో అస్వస్థతకు గురి అయ్యారు అనే అనుమానం తోనే నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వస్తున్నారని వైద్యులు తెలిపారు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేటెడ్ వార్డు ను ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు చైనా  వరకే పరిమితమైన కరోనా వైరస్ ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి కూడా వ్యాప్తి చెందడంతో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. కరుణ వైరస్ ఎటునుంచి దాడి చేస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: