మహారాష్ట్రలో ఎన్నో పరిణామాల తర్వాత మొట్టమొదటిసారి శివసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన నాయకుడిగా రికార్డు సృష్టించారు ఉద్దవ్ థాక్రే . ఇక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన స్టైల్ లో పాలన చేస్తున్నారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం పేదల కోసమేనని ధనికుల  కోసం కాదు అంటూ పలుమార్లు ప్రసంగాలలో తెలిపారు మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే. తాజాగా పేదలకోసం ఓ కీలక నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు ఆకలితో పస్తులు ఉండకుండా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే... పేద ప్రజల కడుపు నింపడానికి వినూత్న పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. కొత్తగా శివ భోజన్  కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నామని.. ఇక్కడ కేవలం 10 రూపాయలకే మంచి భోజనాన్ని పేద ప్రజలకు అందించనున్నామని తెలిపారు. 

 

 

 కాగా ఈ పథకాన్ని మొదటగా పైలెట్ ప్రాజెక్టుగా పలు ప్రారంభించనున్నట్లు తెలిపిన ఉద్దవ్ థాక్రే ... ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా శివ భోజన్  పథకాన్ని విస్తరిస్తామని తెలిపారు. కాగా  నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర మంత్రులు వివిధ ప్రాంతాల్లో శివ భోజన్  కేంద్రాలను ప్రారంభించారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత శివ భోజన్  పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు నాణ్యమైన మంచి భోజనాన్ని అందిస్తామని శివసేన పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల తర్వాత ఎన్నో పరిణామాల మధ్య ఎన్సిపి కాంగ్రెస్ మద్దతుతో... శివసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టోలో పొందుపరచిన ఒక్కో  హామీని అమలు చేసే దిశగా ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ ముందుకు సాగుతుంది. 

 

 

 అయితే మహారాష్ట్రలో  ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ప్రవేశపెట్టిన శివ భోజన్  కేంద్రాల్లో  భోజనం చేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అంటూ గత కొంత కాలంగా వస్తున్న వార్తలను రాష్ట్ర మంత్రి భుజ్ బల్  ఖండించారు. ఎటువంటి గుర్తింపు కార్డులను చూపకుండానే పేద ప్రజలు అందరూ భోజనం శివ బోజన్  కేంద్రాల ద్వారా కడుపునిండా భోజనం చేయొచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా మహారాష్ట్రలో ఉద్దవ్థాకరే ప్రభుత్వం ప్రవేశపెట్టిన శివ భోజన్  పథకం ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు తక్కువ ఖర్చుతోనే మంచి భోజనం దొరకనున్నట్లు రాజకీయ ప్రముఖులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: