ఏపీ సీఎం జగన్ గత అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల గురించి ప్రకటన చేసిన రోజు నుండి మూడు రాజధానుల గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఆ తరువాత మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం, మండలిలో బిల్లును ప్రవేశపెట్టగా మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని సూచనలు చేయడం, శాసన మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయటం కూడా తెలిసిందే. 
 
సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్సీల మద్దతుతో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందేలా చేయాలని అది కుదరని పక్షంలో మండలి రద్దు దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టీడీపీ పార్టీ నుండి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. 
 
నిన్న చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. కొంతమంది ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరైనప్పటికీ వారిలో కూడా కొందరు వైసీపీలో చేరడం మాత్రం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా పదిమంది ఎమ్మెల్సీలు టీడీపీ నుండి వైసీపీలో చేరనున్నారని టీడీపీ ఎమ్మెల్సీలే చంద్రబాబు నాయుడుకు షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. 
 
వైసీపీ పార్టీ టీడీపీ ఎమ్మెల్సీలకు కోట్లల్లో ఆఫర్ చేసిందని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. మండలి రద్దు చేస్తే భవిష్యత్తు ఉండదని గ్రహించి టీడీపీ ఎమ్మెల్సీలే వైసీపీలో చేరాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. నిన్న రాత్రే వైసీపీ పార్టీలో 10మంది వరకు టీడీపీ ఎమ్మెల్సీలు చేరడం ఖాయమైందని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రముఖ పార్టీ నేతలే చెబుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: