రాష్ట్ర విభజన తరువాత 'చంద్రబాబు' అధికారంలోకి వచ్చిన తరువాత 'హైదరాబాద్‌' ఉమ్మడి రాజధానిగా పదేళ్ళపాటు ఉంది. ఆ సమయంలో హైదరాబాద్‌ సచివాలయంలో ఒక భాగాన్ని సచివాలయం కోసం ఇచ్చారు. మొదట్లో చంద్రబాబు అక్కడ నుంచే పరిపాలనను ప్రారంభించారు. ఓటుకు నోటు కేసు అనంతరం ఒక్కసారిగా అక్కడ సచివాలయాన్ని వదిలేసి 'విజయవాడ'కు వచ్చి క్యాంప్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగించారు. ముఖ్యమంత్రి 'విజయవాడ'కు రావడంతో సిఎంఒ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు, అధికారులంతా 'విజయవాడ'లోనే తిష్టవేశారు. దాంతో హైదరాబాద్‌లోని సచివాలయం బోసిపోయింది. సచివాలయానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర సీనియర్‌ అధికారులు రాకపోవడంతో కళాహీనమైపోయింది.

అప్పటి వరకు వివిధ పనుల కోసం హైదరాబాద్‌ వచ్చే వారు..'విజయవాడ' బాట పట్టారు. ఇప్పుడు..ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా వ్యవహరించవచ్చన్నఅన్న అంశం చర్చనీయాంశమైంది. రాజధాని తరలింపు విషయంలో 'చంద్రబాబు' వ్యవహరించిన విధంగానే 'జగన్‌' చేస్తే అభ్యంతర పెట్టేవారు ఎవరు..? అని అధికార పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పార్టీ స్టాండ్ ఏంటో స్పష్టం చేశారు. మొత్తానికి జగన్ వర్గం రాజధానుల వికేంద్రీకరణ అంశం తేలే నాటికి తేలుతుందన్న భావనలో ఉన్నట్టుగా సమాచారంల. 'విశాఖ'కు 'సిఎం జగన్‌' వెళితే మిగతా విషయాలు అవే సర్దుకుంటాయని కొందరు వైకాపా నేతలు అంటున్నారు. కాగా ఇదే విషయాన్ని ఓ సీనియర్‌ అధికారి ఓ మీడియా ప్రతినిధి వద్ద చిట్ చాట్ గా రాజధానిపై ప్రస్తావిస్తూ 'జగన్‌' మూడు రాజధానులంటూ.

అనవసరంగా కెలికారని, ఆయన ప్రశాంతంగా మొదట్లోనే 'విశాఖ'లో సిఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలనను అక్కడ నుంచి కొనసాగించి ఉంటే.. ఇటువంటి ఎదురుదెబ్బలు తగిలేవి కావని వ్యాఖ్యానించారు. మొత్తం మీద...రాజధాని విషయంలో కొరివితో తలగోక్కుని ఇప్పుడు 'జగన్‌' తలపట్టుకుంటున్నారని, ఇప్పట్లో ఈ గందరగోళం తెరపడేది కాదని, ఆయన 'విశాఖ'కు వెళ్లాలనుకుంటే వెంటనే వెళ్లిపోతే రాజధాని సమస్య నెమ్మదిగా సర్దుకుంటుందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఇటీవల ఆయన నియమించుకున్న ప్రముఖ లాయర్‌ కూడా సమర్థించారట. మరి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఆ విధంగా చంద్రబాబును ఫాలో చేస్తారా..? లేదా..? అన్నది వేచి చూడాలి. అధికారికంగానే వెళ్లాలనే తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా..? చూద్దాం.. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: