ప్రస్తుతం ప్రజలను వణికిస్తున్న వైరస్.. ఈ కరోనా వైరస్ చైనాలో ప్రజలను ఇప్పటికే చుక్కలు చూపిస్తుంది.. అయితే తాజాగా ఈ వైరస్ మన హైదరాబాద్ కు సోకింది అని.. అలాంటి అనుమానపు కేసులు రెండు నమోదు అయినట్టు సమాచారం. అయితే అతి వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ కరొనా వైరస్ గురించి వైద్య నిపుణులు ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నారు. 

 

కరొనా అనేది క్రిమి ద్వారా వ్యాపిస్తున్న వైరస్ అని డాక్టర్లు చెప్పారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. కరొనా వైరస్ అనేది కొన్ని వైరస్‌ల కలిపితే వచ్చే ఎంతో ప్రమాదకరమైన వైరస్ అని చెప్పొచ్చు. ఇది కొన్ని కరొనా వైరస్‌లు జంతువులకు మాత్రమే వ్యాపిస్తాయి.. కానీ, ఇందులోనే కొన్ని వైరస్‌లు మనుషులకు కూడా ప్రభావితం చేస్తాయి. 

 

అయితే ఈ కరోనా వైరస్ వచ్చింది అంటే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఈ వైరస్ ఎలా వస్తుంది అంటే..  ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది.. అయితే ఈ వైరస్  దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. అంతేకాదు ఆ వైరస్ ఉన్నవారి గాలి సోకినా ఈ వైరస్ వచ్చేస్తుంది. 

 

వైరస్ లక్షణాలు ఇవే.. జలుబు, తలనొప్పి, దగ్గు, మోకాలి నొప్పులు, జ్వరం పూర్తిగా అనారోగ్య పాలవడం.. ఇవే ఈ వైరస్ లక్షణాలు. అందుకే ఈ వైరస్ వచ్చింది అనేది ఈ లక్షణాలు బట్టి తెలుసుకోవాలి. కాబట్టి ఎందుకైనా మంచిది.. ఆల్రెడీ ఈ వైరస్ ప్రస్తుతం భారత్ లోకి ప్రవేశించేసింది.. అందుకే.. ఎందుకైనా మంచిది.. దగ్గు, జలుబు, తలనొప్పి అని ఉండేవారికి దూరంగా ఉండండి. 

 

లేదంటే.. ఈ వైరస్ సోకె ప్రమాదాలు ఎక్కువ.. ఆ వైరస్ వచ్చినట్టు వారికే తెలియదు.. ఇంకా మనకు ఎం తెలుస్తుంది? అందుకే జలుబు, దగ్గు వంటివి మనకు కామన్ గానే కనిపిస్తాయి. కానీ అవే చాలా ప్రమాదకరం. కాబట్టి గుర్తించుకొని జలుబు, దగ్గు ఉన్నవారికి దూరంగా ఉండండి. అలాగే ఎక్కువ ముఖానికి నాణ్యమైన ఫేస్ మాస్కులు వేసుకొని తిరగండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: