రెండు బిల్లులకు సంబంధించి  శాసనమండలిలో జరిగిన కంపు అందరికీ తెలిసిందే.  అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను శాసనమండలిలో కావాలనే తెలుగుదేశంపార్టీ కంపు చేసేసింది.  ఎందుకింత కంపు చేసిందంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యక్తిగత కక్షతోనే  మండలిలో టిడిపి నానా రద్దాంతం చేసింది. అసెంబ్లీ నుండి వచ్చిన బిల్లులను ఆమోదించవచ్చు లేదా ఓడగొట్టవచ్చు. ఈ రెండింటిలో ఏది చేయటానికైనా మండలికి హక్కుంది.

 

 అయితే  ఈ రెండు మార్గాలను కాకుండా పెండింగ్ పెట్టేట్లుగా సెలక్ట్ కమిటికి పంపటంలో ఆంతర్యం ఏమిటి ? ఏమిటంటే సీనియర్ సభ్యుడు యనమల రామకృష్ణుడు సైంధవ పాత్ర ఉండటమే.  లేని అధికారాలను మండలి ఛైర్మన్  షరీఫ్ కు ఉందని చెప్పి విచక్షణాధికారాల పేరుతో సమావేశాలను గబ్బు పట్టించారు. నిబంధనలు, సంప్రదాయాలు స్పష్టంగా లేనిచోట విచక్షణాధికారాలను ఉపయోగించాలి కాని ఉన్న చోట కాదు.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే తెరవెనుక నుండి షరీఫ్ ను చంద్రబాబునాయుడు, యనమల మ్యానేజ్ చేసిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.  లేని అధికారాలను ఉందని చెప్పి ఛైర్మన్ ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. సెలక్ట్ కమిటికి పంపే అధికారం తనంతట తానుగా ఛైర్మన్ కు లేదని నిబంధనలు చెబుతున్నాయి. ఇక్కడే ఛైర్మన్ నిబంధనలను ఉల్లంఘించారు.   సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు ప్రకటించేసిన ఛైర్మన్ సమావేశాలను నిరవధిక వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు.

 

ఆ తర్వాత తీరిగ్గా ఇపుడు రెండు కమిటీలను  వేస్తామని చెప్పారు. ఇలా అడుగడుగునా ఛైర్మన్ నిబంధనలను ఉల్లంఘించటంలో తెరవెనుక యనమలదే ప్రధాన పాత్రగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగా ఛైర్మన్ నిబంధనలను ఉల్లంఘిస్తుంటే అధికార పార్టీ చూస్తూ ఊరుకోవాలని టిడిపి కోరుకోవటమే విచిత్రంగా ఉంది.  పైగా శాసనమండలిలో జరిగిన అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగకూడదని చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

అంటే తాను అధికారంలో ఉన్నపుడు చంద్రబాబుకు అనుకూలంగా అనిపిస్తుందే. అదే ప్రతిపక్షంలోకి వచ్చినపుడు అంతా తప్పులే కనిపిస్తుంటాయి. తెరవెనుక నుండి షరీఫ్ తో తప్పులు చేయించి చివరకు మండలి రద్దు ప్రతిపాదన వరకూ వ్యవహారాన్ని తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: