ఈ మధ్య అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్యలు ఆత్మహత్యలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. హాయిగా సాగిపోతున్న భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రావడంతో భార్య భర్తల మధ్య చిచ్చు కాస్త ఒకరు ప్రాణాలు ఒకరు తీసుకునేంత వరకు వెళుతుంది. ఇలాంటి ఘటనలు రోజుకొకటి తెర మీదకు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. మెదక్ జిల్లాకు చెందిన తన బతుకేదో తాము బతికేస్తున్నారు. భర్త ఫినాన్స్ సంస్థలో పని చేస్తుండగా భార్య ఇంట్లోనే ఓ చిన్న కిరణా షాప్ పెట్టుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా ఈ ఇద్దరు దంపతుల సంసారం హాయిగా సాగిపోతున్న సమయంలో... ఓ పిడుగు వచ్చి పడింది. వారి ఇంటి దగ్గర లోని డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. రోజు డీసీఎం ఆ మహిళా  షాపు ముందు పెట్టి రోజు షాప్ లో ఏదో కొంటూ మాట్లాడుతూ ఉండేవాడు. 

 

 

 ఇక రోజురోజుకు వారి మధ్య మాటలు ఎక్కువైపోయాయి. ఏకంగా ఆ డీసీఎం డ్రైవర్ షాపులో ఉన్న మహిళలకు మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చాడు దానిద్వారా ఇద్దరి సంభాషణలు మరింత ఎక్కువై పోయాయి. ఇక ఆ మహిళను డీసీఎం లో అక్కడికి ఇక్కడికి తీసుకెళుతూ ఉండడంతో వీరిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. కానీ ఓ రోజు ఈ విషయం భర్తకు తెలిసింది. తన భార్య అదేపనిగా ఫోన్లో మాట్లాడటం  చూసి గమనించి ఫోన్ ఎక్కడిది అంటూ అడిగాడు. నాకెందుకు చెప్పలేదు అంటూ నిలదీశాడు. ఇందులో పెద్దగా చెప్పేదేముంది లే అంటూ సమాధానం తోసిపుచ్చింది భార్య. ఇక భార్య అబద్ధాలు ఆడుతూ ఉంది అని అనుమానించిన భర్త భార్య పై ఓ కన్నేసి వుంచడం మొదలుపెట్టాడు.

 

 

 ఇక ప్రతి విషయంలో భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో తన అక్రమ సంబంధం విషయం భర్తకు తెలుసిందని అర్థం చేసుకున్న భార్య ప్రియుడితో విషయం తెలిపింది.  దీంతో  నేను చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటాను నా భర్త అనుమానిస్తున్నాడు  అని  రెచ్చగొట్టే సరికి ప్రియుడు నీ భర్తను నేను హత్య తీస్తాను టెన్షన్ పడకు అని హామీ ఇచ్చాడు. ఒక పథకం ప్రకారమే మహిళా  భర్తను  ఓ రోజు డీసీఎం లో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించాడు. ఇక ఆ తర్వాత హత్య చేసేందుకు కత్తి తీస్తుండగా కత్తి చేయి జారి కింద పడిపోయింది. అది చూసిన సదరు భర్త కత్తి ఎందుకు అంటే ఇది తుప్పు పట్టింది పనిచేస్తుందో లేదో చూస్తాను అంటూ మూడుసార్లు కడుపులో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేపట్టడం తో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో సదరు భార్య సహా ఆమె ప్రియున్ని  కటకటాల వెనుకకు తోసారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: