పాడేరు ఎమ్మెల్యేగా కొట్టంగుళ్ల భాగ్య‌లక్ష్మి భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాడేరు నియాజకవర్గం అటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నప్పటి నుండి కూడా అప్పట్లో కాంగ్రెస్ కు, తర్వాత వైసీపీకి కంచుకోట. 2009, 2014 to 2019 లో మూడు సార్లు కూడా వైఎస్ ఫ్యామిలీకి ఆక్కడ పట్టంకట్టారు.

 

2014లో జగన్ మోహన్ రెడ్డి గెలవకపోయినా కూడా 30 వేల ఓట్ల మెజార్టీతో అప్పట్లో వైసీపీ తరుపున టీచర్ గా ఉన్నటువంటి గిడ్డి ఈశ్వరిని పోటీ చెయ్యగా ఆమెను గెలిపించారు. అయితే అప్పట్లో ఆమెకు జగన్ మంచి ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఆమె ప్రలోభాలకు ఆశ పది టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆమె టీడీపీలోకి జంప్ అయినప్పటికీ వైసీపీలో క్యాడర్ దెబ్బ తినలేదు.. 

 

ఒకవేళ ఆమె ఇక్కడే వైసీపీలో ఉండి ఉంటె.. ఇప్పటికి ఎస్టీ కోటాలో మంత్రి అయ్యేవారు. కానీ ప్రలోభాలకు ఆశ పడి టీడీపీ జంప్ చేసేసింది. దీంతో ఆ తర్వాత కొట్టంగుళ్ల భాగ్య‌లక్ష్మి రాజకీయాలలోకి వైసీపీలోకి అడుగు పెడితే రాజకీయాలకు కొత్త అయినప్పటికీ కూడా మళ్లీ 35 వేల కోట్ల భారీ మెజార్టీతో ఘాన విజయం సాధించింది.

 

ఈమె చూడటానికి సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో ఏజెన్సీ సమస్యలు మీద కానీ.. వైసీపీకి.. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కానీ మాట్లాడుతూ.. అడ్డతీడ్డంగా కాకుండా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా చేస్తూ అటు నియోజకవర్గంలో ఇటు ఏజెన్సీలో కూడా ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుంది.  

 

కీలకమైన విశాఖ జిల్లాలో వైసీపీకి ఒక లేడీ ఎమ్మెల్యే ఉండటం, మంచి వాయిస్ ఉన్న లేడీ ఎమ్మెల్యే ఉండటం కూడా వైసీపీకి మంచి ప్లస్ పాయింట్ అయ్యింది అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. అయితే ప్రస్తుతం భాగ్యలక్ష్మి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తు పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేస్తున్నారు. జ‌గ‌న్ వాయిస్‌ను బ‌ల‌ప‌రుస్తూ.. త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: