ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  వైసిపి పార్టీ వన్ అండ్ ఓన్లీ బాస్ గా మారిపోయింది. విపక్ష పార్టీల నేతలు అందరి చూపు వైసీపీ వైపే. సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాదు పాలనలో కూడా తనదైన ముద్ర వేసుకుంటుంది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలో ఎమ్మెల్యేలు గా కొనసాగుతున్న వారు తమతమ నియోజకవర్గాల్లో ఆధిపత్యం కలిగి ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు వైసీపీలో ఆధిపత్యపోరు రచ్చ చేస్తుంది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి  ప్రస్తుత ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ మధ్య అధిపత్యపోరు నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి  ఇతర పార్టీ నేతలను తన సమక్షంలో వైసీపీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఈ విషయం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

 నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన నేను  ఉండగా ఇతర పార్టీ నేతలను పార్టీలోకి ఆహ్వానించడాన్ని  మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి ఏం  పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఈ మేరకు ఎస్వి మోహన్రెడ్డి ఓ లేఖను కూడా రాశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే నైనా తన అనుమతి లేకుండా... పార్టీలో చేరికలు చెల్లవు.. సామాన్య కార్యకర్త ను అంటూనే పార్టీ వినాశనం కోరతారా అంటూ ప్రశ్నించారు. నువ్వే ఒక కార్యకర్తవి  ఏ అధికారంతో ఇతర పార్టీల కార్యకర్తలను వైసీపీలో చేరుకుంటావు... నీకు ధైర్యం ఉంటే సొంత నియోజకవర్గమైన పత్తికొండ కు వెళ్లి కార్యకర్తలను చేర్చుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలతో హఫీస్ ఖాన్ ఎస్వీ మోహన్ రెడ్డికి  ఓ లేఖ రాశారు. 

 

 

 అయితే 2014 సంవత్సరంలో వైసీపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు ఎస్వీ మోహన్ రెడ్డి . అనంతరం గతంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన టీడీపీ లోకి ఫిరాయించారు  ఎస్వీ మోహన్ రెడ్డి . ఆ తర్వాత ఎస్వీ మోహన్ రెడ్డి  స్థానంలో హఫీస్ ఖాన్ ను పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల ముందు మళ్ళీ వైసిపి పార్టీ గూటికి చేరిన ఎస్వీ మోహన్ రెడ్డి  తాను ఎన్నికల్లో పోటీ చేయనని కార్యకర్తగానే వైసీపీ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: