ఈరోజు ఉదయం 9.30 గంటలకు ఏపీ కేబినేట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో ప్రధానంగా శాసన మండలి రద్దు గురించి చర్చ జరగింది. తెలుస్తున్న సమాచారం మేరకు కేబినేట్ శాసన మండలి రద్దుకు ఆమోదం తెలిపింది. అత్యంత కీలకమైన నిర్ణయానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. కేబినేట్ భేటీలో మొట్టమొదటి అంశంగా ఈ అంశాన్నే రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది. 
 
రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా శాసన మండలిని రద్దు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఎందుకు రద్దు చేయబోతున్నారో సీఎం జగన్ వివరించటంతో పాటు మంత్రుల అభిప్రాయాన్ని కూడా సీఎం జగన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రులందరూ కూడా కేబినేట్ రద్దు విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం సీఎం జగన్ రాష్ట్రానికి శాసన మండలి అవసరమా...? అని చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. 
 
కొందరు వైసీపీ మంత్రులు భవిష్యత్తులో శాసన మండలి వైసీపీకే అనుకూలం అవుతుందని రాబోయే రెండు సంవత్సరాలలో వైసీపీ పార్టీ వాళ్లు 22 మంది అదనంగా కలుస్తారని చెప్పినప్పటికీ సీఎం జగన్ మాత్రం మండలి రద్దు వైపే మొగ్గు చూపారు. భవిష్యత్తులో మండలి వలన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ శాసన మండలి వలన ప్రస్తుతం ఇబ్బందులు తప్పవని భావించి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
తెలుగుదేశం పార్టీ కేవలం మండలి వేదికగా ఇన్నిరోజులు బిల్లులను అడ్డుకునే ప్రయత్నాలు చేసింది కాబట్టే సీఎం జగన్ మండలి రద్దు వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి శాసన సభకు ఏ అంశం గురించి చర్చించడానికైనా పూర్తి విచక్షణాధికారం ఉంటుంది. స్పీకర్ అనుమతితో ఏ నిర్ణయాన్నైనా తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం ఎమ్మెల్సీలు బిల్లులను కావాలనే పెండింగ్ లో పడేలా చేస్తూ ఉండటంతో ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: