తనను చంద్రబాబునాయుడులాగ తయారు చేయద్దంటూ జగన్మోహన్ రెడ్డి నేతలపై బాగా సీరియస్ అయ్యారని సమాచారం. శాసనమండలి రద్దు విషయంలో జగన్ కు కొందరు మంత్రులు, సీనియర్ నేతల మధ్య చర్చ జరిగిందట. ఆ చర్చలో టిడిపిని వదిలిపెట్టి కొందరు ఎంఎల్సీలు వైసిపిలో చేరటానికి సిద్ధంగా ఉన్నారనే ప్రస్తావన వచ్చింది. ఇప్పటికే ఓ ఎంఎల్సీ పోతుల సునీత టిడిపి నుండి బయటకు వచ్చేసి వైసిపిలో చేరిన విషయం తెలిసిందే.

 

సునీతలాగే ఇంకా కొందరు సభ్యులు టిడిపిని వదిలేసి వైసిపిలోకి వచ్చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రులు జగన్ తో చెప్పారట. దాంతో జగన్ వాళ్ళపై బాగా సీరియస్ అయినట్లు సమాచారం. శాసనమండలి సభ్యులను లాక్కునే విషయంలో కానీ లేకపోతే ప్రలోభాలకు గురిచేసే విషయంలో తనను చంద్రబాబు లాగ తయారవ్వమని  సలహాలు ఇవ్వద్దంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట.

 

మెజారిటి ఉందన్న ఏకైక కారణంతో శాసనమండలిలో  చంద్రబాబు, యనమల ప్రతి బిల్లును అడ్డుకుంటోంది. అసెంబ్లీలో టిడిపి మద్దతిచ్చిన బిల్లులను కూడా కౌన్సిల్లో టిడిపి ఓడగొడుతుండటమే విచిత్రంగా ఉంది. ప్రతిపక్షమంటే ప్రతీ విషయంలోను అధికారపార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించటమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేయటాన్ని జగన్ అంగీకరించలేకపోయారు. 

 

నిజానికి మండలిని రద్దు చేయాలన్న ఆలోచన జగన్ కు లేదు. కానీ చంద్రబాబు, యనమల వైఖరి వల్లే కాకుండా మండలిని రద్దు చేసే అధికారం అసలు జగన్ కు లేదంటూ పిచ్చి ప్రకటనలు చేసి బాగా రెచ్చగొట్టారు. శాసనమండలిలో బిల్లులను సెలక్ట్ కమిటి పరిశీలను పంపుతున్నట్లు ఛైర్మన్ షరీఫ్ చేసిన ప్రకటనను బిజెపి, పిడిఎఫ్, స్వతంత్ర సభ్యులు కూడా తప్పు పట్టిన విషయం అందరూ చూసిందే.

 

తాము తప్పు చేస్తున్నట్లు ఛైర్మన్ , చంద్రబాబు, యనమలకు కూడా బాగా తెలుసు. అయినా ఒక తప్పు చేశారు కాబట్టి దానిపైన మళ్ళీ తప్పులు చేసుకుంటూ పోతున్నారు. అంటే మండలి రద్దుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటంలో  సభ్యులకు సమాధానం చెప్పుకోవాల్సింది చంద్రబాబు, యనమలే అన్న విషయం స్పష్టం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: