అభం శుభం తెలియని బాలికలు శ్రావణి, మనీషా, కల్పనలను అత్యంత దారుణంగా హ‌త్య చేసిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి విష‌యంలో మ‌రి కాసేప‌ట్లో తీర్పు వెలువ‌డ‌నుంది. శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు బాలికలను అత్యంత క్రూరంగా, పాశవికంగా అత్యాచారం చేసి బావిలో మృతదేహాలను పూడ్చి పెట్టిన ఘటన గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. శ్రీనివాస్‌ రెడ్డి కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు  విచారణను ముగించింది.  పోలీసులు ఈ వరుస అత్యాచారం , హత్యల కేసు నుంచి నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి తప్పించుకునే వీలులేకుండా ..పక్కా ఆదారాలను కోర్టు ముందు పెట్టారు . ఉన్నతాదికారులు ప్రతీ విచారణకు హాజరై మరీ..దగ్గరుండి ట్రయల్స్‌లో పాల్గొన్నారు . ఇరుపక్షాల వాదనలు విన్న నలగొండ ఫాస్ట్‌ కోర్టు... ఇవాళ తుది తీర్పును వెలువరించనుంది.

 


నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు బాలికలను అత్యంత క్రూరంగా, పాశవికంగా అత్యాచారం చేసి బావిలో మృతదేహాలను పూడ్చి పెట్టిన ఘటన గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. 
హాజీపూర్ వరుస హత్యల కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు మూడు నెలల పాటు సుదీర్ఘ విచారణను చేపట్టింది. దాదాపు 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానున్న ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షను విధించేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన సాక్ష్యాలను సమర్పించారు. గ్రామస్థులు కూడా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

 


బాధితుల మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన వైద్యులు..శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి తర్వాత చంపేశాడని రుజువుచేసారు. కోర్టులోనూ నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్షాలను పోలీసులు ప్రవేశపెట్టారు. నల్గొండలోని జిల్లా ఫస్ట్‌ సెషన్‌ కోర్టు, నిందితుడు శ్రీనివాసరెడ్డిని విచారించింది. సాక్షుల వాంగ్మూలాలకు సంబంధించి నిందితుడి అభిప్రాయాన్ని న్యాయస్థానం రికార్డు చేసినుంది. రెండు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును నేడు వెల్లడిస్తోంది. ముగ్గురు మైనర్‌ బాలికల్ని పొట్టన పెట్టుకున్న రాక్షసుడికి ఉరే స‌రి అని తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: