ఆంధ్ర ప్రదేశ్ లో 2019 సంవత్సరంలో కొత్త ప్రభుత్వం వచ్చింది.. కొత్త కొత్తగా ఉంది. గడిచిన 8నెలలలో ఎన్నో అభివృద్ధి పనులు.. సంక్షేమ పథకాలు అమలు.. అలానే సీఎం జగన్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు.. సీఎం జగన్ తీసుకున్న అన్ని నిర్ణయాలు గతంలో ఈ ముఖ్యమంత్రి తీసుకోని ఉండరు.. 

                   

అంతేకాదు.. పుట్టిన పాప నుండి వయో వృద్ధుడు వరుకు.. ప్రతిఒక్కరికి సీఎం జగన్ మంచి చేస్తూనే ఉన్నారు. సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలు కూడా చేశారు. అయితే సీఎం జగన్ ఎలా అయితే ప్రజల కోసం శ్రమిస్తున్నారో అలానే సీఎం జగన్ ఎమ్మెల్యేలు.. ఎంపీలు కూడా శ్రమిస్తున్నారు. 

               

అలాంటి వైసీపీ పార్టీలో వనితలు కూడా మాములుగా లేరు.. ఒకొక్కరు ఒక్కో రీతిలో ఆడుకుంటున్నారు.. అలానే పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా దూకుడు రాజకీయాలకు కేర్ అఫ్ గా నిలిచారు. ఆమె మీడియా ముందుకు రాకపోయినా నియోజకవర్గంలో మాత్రం ప్రతిపక్షానికి కొరుకుడు ప‌డ‌నినాయ‌కురాలిగా ఉన్నారు. 

                

అంతేకాదు.. రెడ్డి శాంతి శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న మాజీ ఎమ్మెల్యే పాలవలస రాజశేఖరం కుమార్తెగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెడ్డి శాంతి.. ఐఆర్ఎస్ అయినా భర్త ప్రోత్సాహంతో.. తండ్రి సహకారం రాజకీయాలలో స్థిరంగా నిలబడగలిగారు..  వైసీపీకి అండగా.. దూకుడు రాజకీయాలతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెడ్డి శాంతి. చక్కటి మాట తీరుతో ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రజలకు అండగా ఉంటూ వైసీపీకి శ్రీకాకుళంలో బలంగా.. హ‌డావిడికి దూరంగా ' శాంతి ' మంత్రంగా మారారు రెడ్డి శాంతి. 

మరింత సమాచారం తెలుసుకోండి: