శాసనమండలిని  రద్దు చేయాలంటూ  క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. సరే జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం మండలి రద్దు చేయబోతోందనే సమాచారం ఉదయం నుండే చక్కర్లు కొడుతోంది. అసెంబ్లీలో ఉన్న బంపర్ మెజారిటి కారణంగా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తిరుగుండదు. అయితే  అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ఆమోదిస్తుందా ? ఇపుడిదే సమస్య అందరి బుర్రలను తొలిచేస్తోంది.

 

151 మంది ఎంఎల్ఏల మద్దతు కారణంగా క్యాబినెట్ తీర్మానించిన శాసనమండలి రద్దు తీర్మానం అసెంబ్లీలో ఆమోదం  పొందుతుందనటంలో సందేహం లేదు.  కానీ అసెంబ్లీ తీర్మాన్ని పార్లమెంటులో ని ఉభయ సభలు ఆమోదించాలి. అప్పుడే రద్దు తీర్మానం సంపూర్ణమవుతుంది. మరి పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందుతుందా ?  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసెంబ్లీలో ఆమోదం పొందిన మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కేంద్రానికి లేదు. పైగా ఏప్రిల్లో వైసిపికి వచ్చే నాలుగు రాజ్యసభ ఎంపిల బలం వల్ల జగన్ మద్దతు కేంద్రానికి చాలా అవసరం.

 

రాష్ట్రప్రభుత్వం నుండి వచ్చిన సిఫారసులను ఉభయసభల్లో పెట్టి ఆమోదం తీసుకోవటమే కేంద్రం చేయాల్సిన పని. నిజానికి ఏపిలో శాసనమండలి ఉంటే ఏమిటి ? లేకపోతే ఏమిటి ఇతర పార్టీలకు. కాబట్టి లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం పొందటం ఖాయమనే అనిపిస్తోంది. కాకపోతే  ఆమోదం పొందటానికి టైం పట్టచ్చు. ఉభయసభల్లో ఆమోదం పొందిన బిల్లుకు చివరగా రాష్ట్రపతి సంతకం పడిన తర్వాతే ప్రక్రియ సంపూర్ణమవుతుంది.

 

అయితే మండల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు ఢిల్లీ స్ధాయిలో అడ్డుపడే అవకాశముంది.  ఎందుకంటే మండలి రద్దయితే చంద్రబాబుకు భారీ నష్టం జరుగుతుంది. ఒక్కసారిగా 34 మంది సభ్యులు తన పుత్రరత్నం లోకేష్ తో కలిపి సభ్యత్వాలు కోల్పోతారు. కాబట్టి బిల్లును పెండింగ్ లో పెట్టేట్లుగా ఢిల్లీలోని తన మద్దతుదారులతో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ద్వారా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

 

మరి ఈ విషయాన్ని జగన్ దృష్టిలో పెట్టుకుని తన ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకు బాధ్యత అప్పగించి ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మండలి రద్దుకు ఉభయసభల ఆమోదం తీసుకుంటేనే సక్సెస్ అయినట్లు. ఇందులో భాగంగానే తమకు మద్దతుగా ఉండే డిఎంకె, ఏఐఏడిఎంకె, జెడిఎస్, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీ ఎంపిల మద్దతు తీసుకుంటేనే జగన్ సక్సెస్ అవుతారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: