బ‌య‌ట ఏదో ఒక బోర్డు పెట్టి బిజినెస్‌లు న‌డ‌ప‌డం. చూసేవారికేమో అది పేరుకి ఏదో ఒక బిజినెస్ లోప‌ల జ‌రిగేవి మాత్రం అన్నీ అలాంటి ప‌నులే అంటే... ఏమిట‌నుకుంటున్నారా... మీరేమ‌నుకుంటున్నారో అది అక్ష‌రాలా నిజం.పేరుకి మాత్ర‌మే బ‌య‌ట ఒక బోర్డు పెడ‌తారు. కానీ లోప‌ల జ‌రిగేవి మాత్రం అన్నీ అసాంఘిక కార్య‌క్ర‌మాలే. బ్యూటీపార్ల‌ర్లు, స్పాసెంట‌ర్లు అని బ‌య‌ట బోర్టులు పెట్ట‌డం లోప‌ల మాత్రం అన్నీ వ్య‌భిచార ప‌నులు చేయ‌డం.

 

ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి హైద‌రాబాద్ మాదాపూర్‌లో చోటుచేసుకుంది. స్పాసెంట‌ర్ పేరుతో ఓ వ్య‌భిచార గృహాన్ని నిర్వ‌హిస్తున్నారు ఇద్ద‌రు వ్య‌క్తులు. మాదాపూర్‌లోని ఎస్ ఓటీ పోలీసుల స‌హ‌కారంతో కేపీహెచ్‌బీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు 1.36ల‌క్ష‌ల న‌గ‌దును, ఆరు సెల్‌ఫోన్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో ఆరుగురు యువ‌తుల‌ను అరెస్ట్ చేశారు. ఇక వివ‌రాల్లోకి వెళితే... కూకట్​పల్లికి చెందిన ఎ.కృష్ణ(23), ప్రగతినగర్​కు చెందిన సి.మౌనిక(26)తో కలిసి కేపీహెచ్​బీ కాలనీ రోడ్డు నెం.1, ఎంఐజీ59లోని ఫ్లాట్​ నెంబర్202ను అద్దెకు తీసుకున్నారు. యూనివర్సల్ హెయిర్​అండ్​స్పా సెంటర్​ను ఏర్పాటు చేశారు. 

 

కొన్నిరోజుల పాటు ఈ బిజినెస్‌ను బాగానే సాఫీగా చేసి... అక్క‌డి నుంచి వీరి అస‌లు రంగును బ‌య‌ట‌పెట్టారు.  రెండు తెలుగు రాష్ట్రాల‌నుంచి  వివిధ జిల్లాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చెయ్య‌డం మొద‌లు పెట్టారు. జస్ట్ డయల్, సులేఖ యాప్​ల ద్వారా విటులను రప్పిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు, కేపీహెచ్​బీ పోలీసులతో కలిసి శనివారం అర్ధరాత్రి దాటాక స్పా సెంటర్​పై దాడికి దిగారు. దీంతో అస‌లు గుట్టు మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చింది. విటులు కూకట్ పల్లికి చెందిన సింహాద్రి, కొండాపూర్​కు చెందిన గుణశేఖర్ లతో పాటు నిర్వాహకులు కృష్ణ, మౌనికలను అదుపులోకి తీసుకున్నారు. 

 

ఆరుగురు యువతులను రెస్య్కూ హోంకు తరలించారు. రూ.1,36,160 నగదు, 6 సెల్​ఫోన్స్​ స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు ఇన్​స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఈ వివ‌రాల‌న్నీ తెలిపారు. మ‌రి బ‌య‌ట ఒక‌బోర్డు పెట్టి లోప‌ల చేసే ఇలాంటి అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు పోలాసులు వీరికి గ‌ట్టిగానే శిక్ష‌ప‌డేలా చెయ్యాలంటున్నారు స్ధానికులు. ఇలాంటి వ‌న్నీ ఉంటే  స్పాసెంట‌ర్ల‌కు వెళ్లాల‌న్నా సామాన్య ప్ర‌జ‌లు కొంద‌రు భ‌య‌ప‌డుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: