నేడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి ఏపీ ప్రభుత్వం తెరతీసింది. గత కొద్దిరోజులుగా ఏపీలో శాసన మండలి రద్దు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చేస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఆ బిల్లు శాసనమండలిలో టీడీపీ అడ్డుకోవడం, వాటిని సెలెక్ట్ కమిటీకి మండలి చైర్మన్ పంపడం ఇవన్నీ చోటు చేసుకున్నాయి. ఇక ఆ తరువాత టిడిపి ఎమ్మెల్సీలను వైసీపీ ప్రభుత్వం తమ లాక్కోవాలని చూస్తున్నారు అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ హడావుడి చేస్తూనే ఉన్నారు. 


ఇక శాసనసభలో మెజార్టీ స్థాయిలో వైసీపీకి బలం ఉన్నా మండలిలో మాత్రం టిడిపికి బలం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రతి బిల్లుని  మండలిలో టిడిపి అడ్డుకుంటూ, ప్రభుత్వ నిర్ణయాలు అమలు అవకుండా చూస్తోంది. దీనివల్ల ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితులన్నీ ఓపిగ్గా భరిస్తూ వస్తున్న జగన్ ఇక ముందు ముందు కూడా ఇదే రకమైన ఇబ్బందులు శాసన మండలి ద్వారా తలెత్తుతాయనే భావనతో ముందస్తుగా మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారమే నేడు మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. అయితే మండలిని రద్దు చేయడం ద్వారా ఎన్టీఆర్ తర్వాత స్థానాన్ని జగన్ దక్కించుకుడు. 


అప్పట్లో మండలిని రద్దు చేస్తూ తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 2007లో మండలిని వైయస్ రాజశేఖర రెడ్డి మళ్లీ తీసుకువచ్చారు. ఇప్పుడు అదే మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఇంత స్పీడుగా మండలిని రద్దు చేసిన ఘనత అప్పుడు ఎన్టీఆర్ కి తగ్గితే ఇప్పుడు ఆ ఘనత జగన్ కు దక్కింది.అయితే ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. జగన్ మండలిని రద్దు చేస్తారని ముందు నుంచి పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నా అంత సాహసం చేసేందుకు జగన్ సిద్ధపడ్డారని అంతా భావించారు. కానీ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న జగన్ ఇప్పుడు మండలిని రద్దుచేసి సంచలనం సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: