ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శాసన మండలి విష‌యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడిన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు నారా లోకేష్‌పై వైసీపీ నగరీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాసన మండలి రద్దు అంశంపై స్పందిస్తూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిని రద్దు చేయాలని తాను సీఎం జగన్ ను గట్టిగా కోరుతున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. నేడు  మీడియాతో మాట్లాడిన ఆమె.. తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగా శాసన మండలి విలువలు దెబ్బతిన్నాయని అన్నారు. చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చొని... మండలి ఛైర్మన్‌ను ఎలా కంట్రోల్ చేశారో అందరూ చూశారు. ఇది దురదృష్టకరమ‌ని ఆమె వ్యాఖ్యానించారు.

 

మ‌రోవైపు నారా లోకేష్‌పై మాట్లాడుతూ.. ఈరోజు లోకేశ్ తీరు చూస్తుంటే, చాలా విచిత్రంగా అనిపిస్తోంది. బయటకు వచ్చి, ఏదో సాధించేసినట్టు... శాసనమండలిని రద్దు చేస్తారా? దమ్ముంటే చేయండి అంటున్నారు. బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్లి తొడగొడితే ఏమవుతుందండీ? కోసి ఉప్పూ, కారం పెట్టి, కూర వండేస్తారు. ఆ విషయాన్ని లోకేశ్ తెలుసుకుంటే మంచిద‌ని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే ఇంకో మహా మేధావి ఉన్నాడండీ... యనమల రామకృష్ణుడు. 

 

ప్రజల తీర్పు ఏంటి? ఆయన్ను రెండుసార్లు, ఆయన తమ్ముడిని రెండు సార్లు ప్రజలు ఓడించడాన్ని మనం చూశాం. ప్రజలు అసహ్యించుకున్న ఈయన, ప్రపంచ మేధావిలాగా ఫీల్ అవుతూ, ప్రజా తీర్పును అవమానించేలా మండలిలో ప్రవర్తిస్తున్నారు" అని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ప్రజలు అత్యధిక మెజారిటీని ఇచ్చి, 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూడా, అభివృద్ధి పరమైన నిర్ణయాలను అమలు చేయలేకపోతే ఎలాగని రోజా ప్రశ్నించారు. మరోపక్క, గత ఆరు నెలల కాలంలోనే తాను ఇచ్చిన 80 శాతం హామీలను జగన్ నెరవేర్చారని రోజా వ్యాఖ్యానించారు.

  

మరింత సమాచారం తెలుసుకోండి: