మనిషికి అడగకుండానే దక్కే వరం మరణం. ఇది కావాలని కోరుకోకున్నా తప్పని సరిగా దరికి చేరుతుంది. ఈ మరణానికి మంచి చెడులతో సంబంధం ఉండదు. అసలు తారతమ్యాలే ఉండవు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి మరణానికి ముద్దే. అందుకే ప్రేమగా వరిస్తుంది. తనతో తీసుకెళ్లుతుంది. ఇకపోతే కొందరు చావాలని మరణానికి ఎదురెళ్లిన వారిని ఆ చావు ఏం చేయదు. మరికొందరు చావును కోరుకోక పోయినా వారి దగ్గరికి మరి ప్రేమగా వస్తుంది. కొందరైతే కారణం లేకుండానే మరణిస్తారు.

 

 

చిన్న ప్రమాదాల బారిన పడిన వారికి చావుతప్పదు. కాని ఇక్కడొక అద్భుతం జరిగింది. అదేమంటే ఎనిమిది అంతస్తుల భవనం అంటే సుమారుగా, 90 అడుగుల ఎత్తు నుండి పడిన వారు ఎవరైనా బ్రతికి బట్ట కడుతారా. సామాన్యంగా ఎంతో ఆయుషు ఉంటే గాని ఇలాంటి వారు బ్రతకరు. ఆ చాన్స్ కూడా గాయాలపాలవడం లేదా కాళ్లు చేతులు విరగడం లాంటివి జరుగుతాయి. కాని ఒక మహిళ అంత ఎత్తునుండి పడినా గాని చిన్న గాయం కాకుండా బతికి పోయింది. వింటుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఇప్పుడు వైరల్ గా మారిన ఆ వీడియో చూస్తే దిమ్మ తిరిగి పోద్ది. ఇక ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో జరిగిన ఈ వింత ఘటనలో ఓ మహిళ  90 అడుగులు ఎత్తు 8 అంతస్థుల భవనం నుంచి పడిపోయినా .. ఏమీ కానట్లు అక్కడి నుండి లేచి నిలబడి తాపీగా నడుచుకుంటూ వెళ్లింది. ఇకపోతే  ఓ మహిళ.. అకస్మాత్తుగా 8 అంతస్తుల భవనం నుంచి కాలు జారీ కింద పడిపోయింది. భవనం మీద నుంచి పడిపోయేటప్పుడు .. చెట్లు కానీ.. కరెంటు వైర్లు కానీ .. భవనానికి సంబంధించిన కిటికీల తలుపులు .. ఇలా ఏవీ ఆ మహిళకు అడ్డం రాలేదు.

 

 

దీంతో సరిగ్గా ఆమె నేల మీద పడిపోయింది. పడడం.. పడడం మంచు కుప్ప మీద పడింది. అంత ఎత్తు నుంచి కింద పడ్డనప్పటికీ చిన్న గాయం కూడా కాలేదు. సరిగ్గా ఒక్క నిముషానికి తాపీగా లేచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అయితే ఆ మహిళ అంత ఎత్తు భవనం నుండి ఎలా పడిపోయింది. ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించి, కావాలనే ఈ పని చేసిందా, లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయాలు ఇంకా తెలియలేదు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: