జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కీలక బాధ్యతల్లో ఉన్న మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. శాసనసభ సమావేశాలు అయిపోగానే తమ మంత్రి  పదవులకు రాజీనామా చేయబోతున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీళ్ళద్దరు శాసనమండలిలో సభ్యులుగా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఎంఎల్సీ కోటాలోనే వీళ్ళు మంత్రులయ్యారు.

 

నిజానికి వీళ్ళద్దరూ మొన్నటి ఎన్నికల్లో రామచంద్రాపురం, రేపల్లె నియోజకవర్గాల్లో  పోటి చేసి ఓడిపోయారు.  వీళ్ళిద్దరూ జగన్ కు అత్యంత సన్నిహితులు కావటంతో ఎంఎల్ఏలుగా ఓడిపోయినా కౌన్సిల్ క పంపి మంత్రివర్గంలోకి   తీసుకున్నారు.  అంటే వీళ్ళద్దరికీ జగన్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అందరికీ అర్ధమవుతోంది. అనకు అత్యంత సన్నిహితులు మండలిలో ఉన్నప్పటికీ  కౌన్సిల్ ను రద్దు చేయాలని జగన్ డిసైడ్ చేయటం ఆశ్చర్యమే.

 

నిజానికి కౌన్సిల్ ను రద్దు చేయాలని క్యాబినెట్ తీర్మానించినా, అసెంబ్లీలో ఆమోదించినంత మాత్రాన రద్దయినట్లు కాదు.  పార్లమెంటు  ఉభయసభలు ఆమోదించాలి. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం అవ్వాలి. అప్పటి వరకూ శాసనసభ ఉనికిలోనే ఉంటుంది. అంటే అసెంబ్లీలాగే మండలి సమావేశాలు జరుగుతునే ఉంటాయి. కాబట్టి మంత్రులుగా వీళ్ళద్దరు అప్పటి వరకూ కంటిన్యు కావచ్చు. కానీ మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రులుగా కంటిన్యు అవటం  నైతికంగా మంచిది కాదని వీళ్ళద్దరు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

మరి వీళ్ళ ఆలోచనతో జగన్ కానీ ఇతర సహచర మంత్రులు కానీ ఎంతవరకూ సానుకూలంగా స్పందిస్తారో చూడాల్సిందే. రాజీనామా చేయాలన్న వీళ్ళ ఆలోచనను జగన్ కూడా స్వాగతించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మంత్రులుగా రాజీనామా చేసినా ఇతరత్రా మార్గాల్లో మళ్ళీ వీళ్ళకు క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వటానికి జగన్ సిద్ధంగానే ఉంటారనటంలో సందేహం లేదు. కాకపోతే మంత్రిగా ఉండటం వేరు క్యాబినెట్ ర్యాంకుంటే పోస్టు వేరన్న విషయం గుర్తుంచుకోవాలి. చూద్దాం రాజీనామాల విషయంలో జగన్ ఏమి చేస్తారో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: