ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ మధ్య రోజురోజుకూ వార్ పెరిగిపోతోంది. ఇందుకు ఇటివల ప్రకటించిన మూడు రాజధానుల ఏర్పాటు అంశం ఈ రెండు పార్టీల మధ్య మంటలు రగిలిస్తోంది. దీనికి ఇటివలి మండలి నిర్ణయం మరింతగా ఆజ్యం పోస్తోంది. మండలి వ్యవస్థను రద్దు చేస్తామని జగన్ ప్రభుత్వం తాజా మంత్రి మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే టీడీపీ ఆధిక్యం ఎక్కువున్న మండలిని రద్దు చేయడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

 

 

ఇప్పుడీ అంశాన్ని హైలైట్ చేస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరో ఉద్యమానికి తెర తీస్తారని రాజకీయ విశ్లేషకుల మాట. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదోక అంశాన్ని తీసుకుంటూ ప్రచారం చేసుకుంటున్న బాబు ఇప్పుడు మండలి అంశంతో రాజకీయంగా మరో అస్త్రం సిద్ధం చేసుకుంటారని అంటున్నారు. మొదట్లో ఇంగ్లీష్ మీడియం అంశం, తరువాత ఇసుక అంశంపై రాష్ట్రంలో రచ్చ చేసిన బాబు.. తర్వాత అమరావతి అంశం తీసుకుని ఇప్పటికీ అలుపెరుగని రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు మండలి రద్దు అంశంతో టీడీపీకి మరో కొత్త టాపిక్ దొరికినట్టైంది. ఇవాళ కాకపోతే రేపయినా రాజధాని అంశం సద్దుమణుగుతుంది. ఈలోపు టీడీపీకి కొత్త టార్గెట్ ఫిక్స్ అయినట్టే.

 

 

ఎలాగూ మండలి రద్దు కావాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాల అనంతరం రాష్ట్రపతి వద్దకు మండలి అంశం వెళుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత మండలి రద్దు కావచ్చు. ఈలోపు రాజధాని అంశం తేలిపోతే టీడీపీ మళ్లీ మండలి అంశంతో ప్రజల్లో, మీడియా సహకారంతో మరో రచ్చకు అవకాశం దొరుకుతుంది. మొత్తానికి చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు ప్రజల్లో ఉండడానికి ఏదొక అంశం రెడీగా ఉంటోందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: