ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ శాసన మండలి రద్దు నిర్ణయానికి ఫిక్స్ అయిపోవడంతో క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడంతో అసెంబ్లీలో కూడా మండలి రద్దు బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉండటంతో ఇదే బిల్లు కేంద్రంలో కూడా ఆమోదం పొందే అవకాశం ఎక్కువ ఉండటంతో శాసనమండలిలో చాలా మంది సీనియర్ నాయకుల రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. శాసనమండలిలో మేధావులు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉండగా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఆమోదం తెలిపిన బిల్లులను అడ్డుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసన మండలి రద్దు నిర్ణయానికి ఓకే చేయటంతో కుండలిలో ఉన్న ప్ర‌స్తుత ఎమ్మెల్సీలు, రేపో మాపో ఎమ్మెల్యేలుగా పోటీ చేయ‌లేని వారు ఎమ్మెల్సీలు అవ్వాల‌నుకునేవారు.. చివ‌ర‌కు మండ‌లి నుంచి మంత్రులుగా ఉన్న పిల్లి బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ లాంటి వాళ్లు సైతం ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి..ఏర్పడింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

దాదాపు వీళ్ళ రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడినట్లే అనే కామెంట్లు మరోపక్క వినబడుతున్నాయి. చాలామంది ఎన్నికల ప్రచారంలో మరియు ఎన్నికల ముందు వైసీపీ పార్టీలో పదవులు ఆశించి చేరి కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి తరువాత మంత్రులు అయ్యే అవకాశాలు పొందుతున్న వైసీపీ పార్టీలో ఉన్న ఆశావహుల పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని వీరి విషయంలో భవిష్యత్తులో వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న టెన్షన్ కూడా మరోపక్క పార్టీలో  నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

కాగా శాసన మండలి రద్దు నిర్ణయం విషయంలో చాలా దూకుడుగా వెళ్తున్న వైయస్ జగన్ స్పీడ్ కి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా టెన్షన్ లో ఉన్నట్లు..ముఖ్యంగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పొలిటికల్ ఫస్ట్ స్టెప్ కి జగన్ తుట్లు పొడిచినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు 

మరింత సమాచారం తెలుసుకోండి: