ఏపీ క్యాబినెట్ శాసన మండలి రద్దు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదం పొందటం గ్యారెంటీగా జరిగే అవకాశం ఉండటంతో శాసన మండలి రద్దు బిల్లు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఈ సందర్భంగా ఈ బిల్లును ఎలాగైనా కేంద్రం దగ్గర ఆమోదం పొందేలా వైసిపి పార్టీ నేతలకు అనగా పార్లమెంటు సభ్యులకు ఈ బిల్లును జగన్ టార్గెట్ చేసినట్లు..వైసీపీ ఎంపీలు ఈ స‌మావేశాల్లో లేదా బ‌డ్జెట్ స‌మావేశాల్లో కేంద్రం ఆమోదం పొందేలా చేస్తారా ? అన్న‌ది చూడాలి.. ఇది వైసీపీ ఎంపీలు ఎంత త్వ‌ర‌గా కేంద్రం వ‌ద్ద మూవ్ చేస్తే అంత త్వ‌ర‌గా అక్క‌డ పాస్ అయ్యి రాష్ట్ర‌ప‌తి ఆమోదానికి వెళుతుంది.

 

దీంతో అక్కడ కూడా ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి రద్దు అయినట్లే. దీంతో ప్రస్తుతం తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీ అలాగే ఇంకా కొంతమంది సీనియర్ నేతల రాజకీయ కెరియర్ అటూ ఇటూ కాకుండా అయిపోయింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎక్కువగా శాసనమండలిలో ఉండటంతో జగన్ వ్యవహరిస్తున్న దూకుడుకి వాళ్లు బెదిరి పోతున్నట్లు ఎటొచ్చీ మాకే ఈ దెబ్బ గట్టిగా పడినట్లు అనవసరంగా ఆరోజు మండలిలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి మా రాజకీయ జీవితానికి మేమే పుల్ స్టాప్ పెట్టుకున్నట్లు అయ్యిందని భావిస్తున్నట్లు టిడిపి పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి.

 

ఈ సందర్భంగా బీఏసీ సమావేశంలో ఒకరోజు అసెంబ్లీ జరగనుందని నిర్ణయం తీసుకోవటం ఇదే స్థాయిలో అసెంబ్లీలో శాసన మండలి రద్దు పై  అసెంబ్లీలో సునాయాసంగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందే అవకాశం ఉన్న క్రమంలో మిగతా ఎపిసోడ్ అంతా వైసిపి పార్టీ ఎంపీలే నడిపించాలని ఎలాగైనా చాలా త్వరగా శాసన మండలి రద్దు కి ఆమోదం పార్లమెంటులో పొందేలా వ్యవహరించాలని జగన్ వైసీపీ ఎంపీలకు ఆదేశాలు ఇచ్చినట్లు...దీంతో ఈ బిల్లు విషయంలో కేంద్రం వ‌ద్ద మూవ్ అయ్యే క్రమంలో ఏదైనా అడ్డుపడితే మాకు ముసళ్ళ పండగ మొదలైనట్లే అన్న భావనలో ప్రస్తుతం వైసిపి ఎంపీలు ఉన్నట్లు ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో గాని లేదా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో గాని శాసన మండలి రద్దు బిల్లు కేంద్రం వ‌ద్ద మూవ్ అయ్యేలా వ్యవహరించాలని జగన్ పేర్కొన్నట్లు ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందేలా చూడాలని ఎంపీలకు సూచించినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: