జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తుంటే... రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో మాత్రం గునపాలు గుచ్చుతున్నాయి. ఎవరి ఊహకి అందనంత ఎత్తులో జగన్ నిర్ణయాలు ఉండడంతో.. రాజకీయ ప్రత్యర్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో టిడిపి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా ప్రజా బలం లేని కొంతమంది పడక్కుర్చీ టిడిపి మేధావులు జగన్ నిర్ణయం పై తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. వారిలో ముఖ్యంగా మొదటి నుంచి టిడిపిలో ఉంటూ చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ వస్తున్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కీలక సీనియర్ నాయకుడు ఆందోళనలో ఉన్నాడు. 

 

ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన, కుటుంబ సభ్యులు వరుసగా మూడు సార్లు ఓటమి చెందారు. దీంతో ఆయనకు ప్రజాబలం ఏ విధంగా ఉందో అర్ధం అయిపొయింది. అయినా ఆయనకు గత టీడీపీ ప్రభుత్వంలో  ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యత అప్పగించారు.అప్పటి నుంచి ఎమ్మెల్సీగా కాలక్షేపం చేసుకుంటూ తన రాజకీయ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవి కూడా పోయేలా ఉండడం,  ప్రజల్లోనూ పలుకుబడి కోల్పోయిన నేపథ్యంలో ..ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే కావడం అసాధ్యమనే భావంలో ఆ సీనియర్ నాయకుడు ఉండిపోయారు.


 తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక ధ్వజస్తంభం అంటూ ఓ సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సదరు ఎమ్మెల్సీ ని ప్రశంసిస్తూ వచ్చారు. ముఖ్యంగా శాసనమండలిలో సదరు ఎమ్మెల్సీ అడుగడుగున ప్రభుత్వానికి అడ్డుగోడగా నిలుస్తూ.. చంద్రబాబుకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నారు. 


టిడిపి ప్రభుత్వంలో ఎన్నో అక్రమ మార్గాల ద్వారా భారీగా లబ్ధి పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఎమ్మెల్సీ తన వియ్యంకుడుకి కూడా గత ప్రభుత్వంలో  ఓ కీలక నామినేటెడ్ పదవి దక్కేలా చేసుకున్నారు. అలాగే తన పలుకుబడితో తెలంగాణలోనూ కీలకమైన కాంట్రాక్టులు దక్కించుని భారీగా లబ్ధి పొందినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి పోతే ఇక పార్టీలోనూ, ప్రజల్లోనూ తనను పట్టించుకునేవారే ఉండరని సదరు ఎమ్మెల్సీ బాధపడి పోతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: