కంచంలో పెట్టిన చేపల పులుసు మాయమైన చందంగా తిరుమలలో శ్రీవారి సేవా దర్శనాల టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నట్లుగా ఆదారాలతో బయట పడ్డా.. నిందితులను పకడ్బందీగా పట్టుకున్నా బ్లాక్‌ టిక్కెట్ల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు హయాంలో కూడా తిరుమల కొండపై బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకున్న వారిని పట్టుకున్నారే తప్ప వారికి ఆ టిక్కెట్లు అందజేసిన వారి వివరాలను బయట పెట్టలేదు. అప్పుడు.. ఇప్పుడు అదే తంతు జరుగుతోంది. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మితే తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన అధికారులు పట్టుకుంటారు అనే భయం టిక్కెట్లు ఇచ్చే వారిలో లేదు.. అమ్ముకుంటున్న వారిలో కనిపించటం లేదు.

అంతా శ్రీవైష్ణవులే..  శ్రీవారి సేవా టిక్కెట్లు, మరియు విఐపి బ్రేక్‌ దర్శనాల టిక్కెట్లు, వసతి గదులను బ్లాక్‌లో అమ్ముకునే వారు అమ్ముకుంటూనే ఉన్నారు. అలా అమ్ముకునే వారిని టిటిడి విజిలెన్స్‌ అధికారులు పట్టుకుంటున్నారు. అయినప్పటికీ ఆ బ్లాక్‌ టిక్కెట్‌ అమ్మకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ బ్లాక్‌ టిక్కెట్లు వెనుక ఎవరెవరు ఉన్నారు అనే విషయం విజిలెన్స్‌ అధికారులకు తెలుసు. కానీ కొందరిని మాత్రమే పట్టుకుంటున్నారు. అసలైన వారు పట్టుబడ్డా వదిలి వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఛైర్మన్‌ కార్యాలయం, ప్రముఖుల సిఫార్సులతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అమాత్యుల సిఫార్సులతో కూడా శ్రీవారి సేవా టిక్కెట్లు, విఐపి బ్రేక్‌ టిక్కెట్లను బ్లాక్‌లో ఇప్పటికీ అమ్ముకుంటూనే ఉన్నారు. వందమంది ఆ విధంగా బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతుంటే.. కేవలం పది మంది మాత్రమే పట్టుబడుతున్నారు.

ఆ పది మందిలో ఇద్దరు.. ముగ్గురుపై మాత్రమే చర్యలు తీసుకుని మిగతా వారిని ఒత్తిళ్లతో వదిలేస్తున్నారని అందుకు ఆదారాలు మా దగ్గర ఉన్నాయని టిటిడి అధికారులు, క్రిందిస్థాయి ఉద్యోగులు చెబుతున్నారట.
కొంతమంది టిటిడి ఉద్యోగులు, కింది స్థాయి అధికారులు కూడా ఈ బ్లాక్‌ టిక్కెట్ల కుంభకోణం వెనుకున్నారని బయట పడినప్పుడు తూతూ మంత్రంగా విచారణ జరిపారు. ఆదారాలున్నప్పటికీ రాజకీయ, అధికార ఒత్తిళ్లతో కొంతమందిపై చర్యలు తీసుకున్నారు… ఎక్కువ మందిని నిరపరాదులు అని వదిలి వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: