శాసన మండలి రద్దు కు కేబినెట్ ఆమోదం.ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం.మంత్రి పదవులు కోల్పోనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ. మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం. పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజవర్గం. శాసన మండలి రద్దుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో శాసన మండలి రద్దు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

శాసన మండలిని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. అసెంబ్లీ ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపుతారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్ డిఏ రద్దు బిల్లులను శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించడంతో నిర్ఘాంత పోయిన రాష్ట్ర ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నది.


మూడు రాజధానులకు మద్దతుగా నగరంలో వైసీపీ యువజన విభాగం అద్వర్యంలో బైక్ ర్యాలీ.పాత కలెక్టరేట్ సమీపాన దివంగత నేత వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి ర్యాలీని ప్రారంభించిన నిత్యానంద రెడ్డి.ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డి కూడలి మీదుగా పార్టీ కార్యాలయం వరకూ సాగిన ర్యాలీ. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గోన్న యువకులు. ఇదిలా ఉండగా గవర్నర్, శాసన సభ స్పీకర్ కు లేఖ రాసిన టీడీపీ శాసన సభా పక్షం. టీడీపీ శాసన సభా పక్షం లేఖలోని సారాంశం..

సభల నిర్వహణలో బీఏసీ అజెండా ను ఉల్లగించారని ఫిర్యాదు. ఇప్పటికే ఆమోదించిన బిల్లులపై చర్చ పెట్టి చెడు సాంప్రదాయాలకు నాంది పలికారు. 3 రోజులు మాత్రమే అసెంబ్లీ అని బీఏసీ లో నిర్ణయించారు. బీఏసీ కి చెప్పకుండానే మూడు రోజుల పాటు ఇష్టానుసారం సభను పొడిగించారు. మండలి సెలక్ట్ కమిటీ కి పంపిన బిల్లులను అసెంబ్లీ లో చర్చించడం రూల్స్  విరుద్ధం. కౌన్సిల్ లో మాట్లాడిన అంశాలను శాసన సభలో ప్రస్తావించకూడదు. రాజ్యాంగ విరుద్ధం గా జరిగే చర్చలో పాల్గొనకూడదనే సభను బాయ్కాట్ చేసాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: