ఒక బలమైన ఆలోచనలతో స్దాపించిన పార్టీకి, ఎంతటి ఉపద్రవాలు ఎదురైన అంతే బలంగా ఎదుర్కొంటుంది. సిద్దాంతాలను ప్రాణాలకంటే ఎక్కువగా విశ్వసించినప్పుడు, వాటికోసం ప్రాణాలు పోతున్న తన విలువలను మాత్రం దిగజార్చుకోని నాయకుల్ని ఈ భరత మాత కన్నది. ఒకప్పటి మేధావులను స్మరించుకుంటే వారికి డబ్బులేదు, చేతిలో అధికారాలు లేవు కాని మనోబలం, ధైర్యం, విలువల్ని నమ్ముకున్న ఆత్మ విశ్వాసం, ఈ ఆయుధాలు వారిని మహానీయులుగా ప్రపంచానికి చాటాయి.

 

 

ఇందుకు ఉదాహారణలుగా ఎందరో ఉన్నారు. ఇక నేటి రాజకీయాల్లో చూసుకుంటే అవకాశ వాదులే ఎక్కువగా కనిపిస్తున్నారు. వారు ఎందుకు అలా ప్రవర్తిస్తారో వారి అంతరాత్మకు తప్పని సరిగ్గా సమాధానం చెప్పుకోవలసిన పరిస్దితి ఉంటుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కోట్లమంది అభిమానుల హృదయాల్లో స్దానాన్ని సంపాదించుకున్న హీరో. అతని ఆలోచనలు నచ్చిన ఎందరో, తాను జనసేన పార్టీ పెట్టినప్పుడు, అతని అడుగు జాడల్లో నడిచారు. అతని మాటలు ఆసమయంలో ఒక ప్రభంజనంగా మారి అభిమానుల గుండెల్లో ఆవేశాన్ని రగిలించాయి.

 

 

కానీ ఏ సిద్దాంతాల కోసం పవన్ పార్టీ పెట్టాడో, ఇప్పుడు ఆ పార్టీ ఏ స్దాయిలో నిలదొక్కుకుని ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొందరికైతే పవన్ పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు అర్ధం కాక పిచ్చేక్కిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారట. ఇకపోతే ఒకప్పుడు జనసేన పార్టీని ఎవరు ఎంత ఒత్తిడి చేసినా.. తమ పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయనని ప్రకటించారు. జాతి సమగ్రతను కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన పార్టీ జనసేన అని అందుకే జనసేనను ఏ పార్టీలోనూ కలపమని స్పష్టం చేయడమే కాకుండా..  తాను సత్యం కోసం పనిచేసేవాడినని, నా బలం, నా బలహీనత నాకు తెలుసు.. అని పేర్కొన్నారు.

 

 

ఇంతలా అభిమానులను తన మాటలతో ప్రభావితం చేసిన పవన్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు వల్ల ఎంతటి అపవాదును మూటగట్టుకున్నాడో అందరికి తెలిసిందే. ఇక్కడ అయిపోయిందని తాజాగా కమళంతో దోస్తి కట్టిన ఈ జనసేనాని తన గమ్యాని, తన పార్టీ గమ్యాన్ని ఎలా నిర్దేశించాడో తెలియదు గాని ఇప్పుడు ఏపీలో మాత్రం ఒక విషయంలో చాలా పెద్ద చర్చ నడుస్తుంది. అదేమంటే సోమవారం నాడు ఉదయం ఏపీ కేబినెట్  ఏపీ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయాలనే తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని సీఎం జగన్ సభలో ప్రవేశపెట్టారు. ఇక ఏపీ శాసనమండలి రద్దుపై ఏపీ ప్రభుత్వం పంపిన తీర్మానంపై కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తోందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

 

కానీ ఈ సమయంలో వినిపించే గుసగుసలు ఏంటంటే ఈ మండలి రద్దు ప్రక్రియకు ఏడాది లేదా ఏడాదిన్నర పట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కేంద్రాన్ని ఒప్పించుకుంటే, ఆర్నెళ్లు, ఏడాదిలోపే రద్దు చేయొచ్చని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్నందున మండలి రద్దుకు మోడీ ప్రభుత్వంపై పవన్ ఒత్తిడి తెస్తే పని సులువు అవుతుంది. కానీ పవన్ అలాచేయడని, అప్పుడే అడ్డు పుల్ల‌లాట మొద‌లెట్టేశాడని అనుకుంటున్నారట. ఇకపోతే ఈ మండలి కనుక రద్దైతే రాజకీయ నిరుద్యోగులుగా ఎంతమంది మిగులుతారో ఇప్పటికే ఒక అంచనా కూడా వచ్చేసింది. ఇక చూడాలి ఈ విషయంలో కేంద్రం ఆమోదం పొంది ఏపీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంటుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: