మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోను టీడీపీ అధినేత చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీ నేతలపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తున్నారు. టీడీపీ చేసిన తప్పులను ఎత్తిచూపిస్తూ తన మాటలతోనే టీడీపీ నేతలకు చురక తగిలేలా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీలో మాట్లాడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో వైసీపీ 51 శాతం ఓట్లు సాధించి ప్రజాస్వామ్య తీర్పుతో గెలిచిందని ఇంత ఓటింగ్ శాతంతో గెలవడం అరుదుగా జరుగుతుందని చెప్పారు. కానీ కొన్నిసార్లు రెండు మూడు పార్టీలు కలిసి ప్రజల తీర్పుతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారని అన్నారు. ఈ సభలో మూడు చట్టాలు వస్తే ఆ చట్టాలకు బ్రేక్ వేసే పని జరిగిందని అన్నారు. 
 
ఎవరినైతే ప్రజలు తిరస్కరించారో వారు మరొక దారిలో వచ్చి బిల్లులను అడ్డుకుంటున్నారని అన్నారు. ఇలా బిల్లులను అడ్డుకుంటే ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లేనని ధర్మాన అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాలు 178 దేశాల్లో ఉంటే కేవలం 67 దేశాల్లో మాత్రమే ఎగువ సభలు ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ముందున్న దేశాల్లో కూడా సభలను రద్దు చేసే కార్యక్రమమే జరుగుతోందని చెప్పారు. 
 
బ్రిటీషర్ల ప్రోత్సాహంతో దేశంలో ఎగువ సభలు ఏర్పడ్డాయని పెద్దలను గౌరవిస్తున్నట్టు తెలపటానికి  ఎగువ సభలు ఏర్పాటు చేశారని. మహాత్మగాంధీ స్వాతంత్ర్యానికి ముందే ఈ సభలను వ్యతిరేకించారని అన్నారు. ఎన్నికల్లో గెలవలేని వారికి మండలి రాజకీయ పునరావాస కేంద్రమవుతోందని అన్నారు. మండలికి 300 కోట్లు ఖర్చవుతోందని ఈ డబ్బును పేద ప్రజల కోసం ఉపయోగించవచ్చని చెప్పారు. 
 
రాజ్యాంగం రచించిన బి ఆర్ అంబేద్కర్ మండలి శాశ్వతం కాదని తాత్కాలికం అని చెప్పారని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా శాసన మండలి రద్దు నిర్ణయం ఉందని చెప్పారు. ఏ అభిప్రాయాన్ని చట్ట రూపం చేయలేని సభ ఎందుకని ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా సెలక్ట్ కమిటీకి బిల్లులను పంపారని ధర్మాన అన్నారు. సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నైస్ గా మాట్లాడుతూనే బాబుకు చుక్కలు చూపించారు. నిర్మాణాత్మక విమర్శలతో బాబును కత్తి లేకుండానే నైస్ గా కోసేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: