ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రముఖులను చంపుతామని లేఖ ఒకటి వచ్చి సంచనాలు సృష్టిస్తుంది. అయితే ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్న విషయం కొంచెం సందిగ్ధం లో పడ్డారు. అయితే, ఆ 15 మందిని ఎందుకు టార్గెట్ చేశారు అన్న విషయం మాత్రం అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకు వాళ్లనే అన్న కోణాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.


అసలు విషయాని కొస్తే..15 మంది ప్రముఖ వ్యక్తులను చంపుతామంటూ కర్ణాటక లోని ఓ ఆశ్రమా నికి బెదిరింపు లేక వచ్చింది. ఈ లేఖ లో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, నటుడు ప్రకాష్ రాజ్, కమ్యూనిస్ట్ మహిళా నేత బృందకారత్, నిజగుణానంద స్వామి, మరో నటుడు చేతన్ కుమార్, భజరంగ్ దళ్ నాయకుడు మహేంద్ర కుమార్, జర్నలిస్ట్ అగ్ని శ్రీధర్ తో సహా మరి కొంతమంది పేర్లు ఈ లేఖలో ఉన్నట్లు తెలుస్తుంది. 


లేఖ లో ఎందుకు చంపాలి అను కుంటున్నాము అదే దానికి వివరణ కూడా రాసారు, వీరు దేశానికి, ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు కాబట్టే వీరిని హత్యచేస్తామని లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపై నిజగుణానందస్వామి ఆశ్రమ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆశ్రమకి పోలీసులు భద్రతా కల్పిస్తామని చెప్పగా, నిజగుణానంద తిరస్కరించినట్లుగా తెలుస్తుంది.  

 

అయితే  ఆశ్రమ నిర్వాహకులు ఆ లేఖను జిల్లా ఎస్పీకి అందించారు. ఆశ్రమానికి అదనపు భద్రతను కల్పిస్తామని పోలీసులు చెప్పగా, నిజగుణానంద స్వామి తిరస్కరించారు. అయితే తనను కూడా హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయంటూ మాజీ సీఎం కుమారస్వామి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. మరి 29 న వారిని నిజంగా చంపుతారా లేక ఇదంతా భోగట్టానా అనే విషయాలని తెలుసుకొనే ప్రయత్నంలో ఇంటిలిజెన్స్ టీమ్ ప్రయత్నిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: