తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ 100 స్పీడ్ తో దూసుకుపోయింది. అయితే పలు చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ కారు  పార్టీ కి భారీ షాక్ ఇచ్చింది. పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిస్తే... పలు చోట్ల కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు సమాన బలాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్  చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా నేరేడుచర్ల, చెండురు, చౌటుప్పల్ మున్సిపాలిటీ లలో చైర్మన్ ఎన్నిక పలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. టిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఏకంగా దాడులు కూడా జరుగుతుంది. 

 

 

 నేరేడుచర్ల మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక గాను కాంగ్రెస్ 7,  టిఆర్ఎస్ 7, సిపిఎం పార్టీ లో ఒకటి గెలుచుకున్నాయి . ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సిపిఎం లు కూటమిలో ఏర్పడగా.. ప్రస్తుతం ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీకి 3 ఎక్స్ అఫీషియో ఓట్లు కల్పించగా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎక్స్ అఫిషియో ఓట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాత్రమే ఎక్స్ అఫిషియో ఓటు కల్పించారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ని కలవగా.. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావుకు ఎక్స్ అఫిషియో మెంబర్గా చోటు కల్పించారు. ఇక చైర్మన్ ఎన్నిక జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఓటు కల్పించడం తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి.. మైక్ విరగొట్టి  పేపర్లు చింపేసి చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా వేయాలని డిమాండ్ చేసారు. 

 

 

 ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి... కెవిపి ఓటును రద్దు చేస్తున్నట్లు తెలిపారు దీంతో ఈ రోజు సాయంత్రం మరోసారి నేరేడుచర్ల లో చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ఇదిలా ఉంటే చౌటుప్పల్ లో కూడా చైర్మన్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదట కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన సిపిఎం పార్టీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో  మాత్రం టిఆర్ఎస్ కు మద్దతుగా ఓటు వేసింది.దీంతో  సీపీఎం సభ్యులు టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారు అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలందరూ సిపిఎం సభ్యుల మీద రాళ్ల దాడి చేయడంతో పాటు వారి ఇళ్లపై దాడి చేశారు.ఇదిలా ఉంటే అటు కాంగ్రెస్ టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక పోలీసులు లాఠీఛార్జి చేసి మరి ఇరువర్గాలను అదుపులోకి తీసుకూరాల్సిన పరిస్థితి ఏర్పడింది.  మరోవైపు చండూరు లో కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: