బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కలిశారు. ముఖ్యమంత్రి జగన్ ను తన కుమారుని వివాహానికి హాజరు కావాలని సీఎం రమేష్ ఆహ్వానించారు. ఫిబ్రవరి 7వ తేదీన తన కుమారుడు రిత్విక్ వివాహం జరగనుందని వివాహానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరారు. అసెంబ్లీ లాబీలోని సీఎం జగన్ ఛాంబర్ లో సీఎం రమేష్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి శుభలేఖను అందించారు. 
 
ఇటీవలే సీఎం రమేష్ ప్రధాని నరేంద్రమోదీని కూడా కలిసి తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని కోరారు. 2019 సంవత్సరం నవంబర్ నెలలో ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తుళ్లూరి కుమార్తె పూజతో రిత్విక్ నిశ్చితార్థం దుబాయ్ లో జరిగింది. సీఎం రమేష్ తన కుమారుని వివాహానికి సీఎం కేసీఆర్, సీఎం జగన్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులను ఆహ్వానించినట్టు సమాచారం. 
 
సీఎం రమేష్ బీజేపీ పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నేతలను వివాహానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ ను సీఎం రమేష్ కొన్ని రోజుల క్రితం కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవ సమయంలో కూడా కలిశారు. మరోసారి ఈరోజు సీఎం జగన్ ను సీఎం రమేష్ కలిశారు. సీఎం జగన్ సీఎం రమేష్ మధ్య జరిగిన రెండు భేటీలు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని భేటీలు కావడం గమనార్హం. ఎటువంటి రాజకీయ అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు రాలేదని తెలుస్తోంది. 
 
నవంబర్ లో దుబాయ్ లో జరిగిన కుమారుని నిశ్చితార్థ వేడుకలను సీఎం రమేష్ అంగరంగ వైభవంగా నిర్వహించినట్టు వార్తలు వచ్చాయి. అతిథులను 17 ప్రత్యేక విమానాలలో దుబాయ్ కు తీసుకెళ్లినట్టు వార్తలు వినిపించాయి. 75 మంది ఎంపీలు నిశితార్థ వేడుకలకు హాజరయినట్లుగా వార్తలు వెలువడ్డాయి. తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేష్ ఆ తరువాత కాలంలో బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: