కరీంనగర్ జరిగిన కార్పొరేషన్  ఎన్నికల  ఓట్ల లెక్కింపు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఇప్పటికే అభ్యర్థుల భవితవ్యం ఎంతో తేలిపోయింది. మొత్తంగా మొన్న విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో  కారు  పార్టీ జోరు  చూపించినట్లు ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపులో కూడా కారు 100 స్పీడ్ తో దూసుకుపోతోంది. కారు జోరుకు ఏ పార్టీ కూడా బ్రేకులు వేయలేకపోతోంది. గతంలో పార్లమెంట్ ఎలక్షన్లలో టిఆర్ఎస్ కంచికోట లాంటి కరీంనగర్లో బిజెపి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు. 

 

 

 అయితే గతంలో పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించాం ఇప్పుడు కూడా విజయం సాధిస్తాం అనే ధీమాతో ఉంది బిజెపి పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తా ఏంటో చూపించింది. ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ నుంచి టిఆర్ఎస్ పార్టీ మెజారిటీ తో దూసుకుపోతుంది. దీంతో ఏ పార్టీ కూడా టిఆర్ఎస్ జోరు ముందు నిలువ లేక పోతుంది. గతంలో పార్లమెంటు ఎన్నికల్లో పట్టు కోల్పోయి ఓటమి చవిచూసిన టిఆర్ఎస్ పార్టీ... ప్రస్తుతం మాత్రం కంచుకోటలో పట్టు నిలుపుకొని  ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. 

 

 

 దీంతో టిఆర్ఎస్ శ్రేణులు అందరూ సంబరాలు జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపులో టిఆర్ఎస్ విజయం ఖాయం అయిపోయింది . ఇక చివరిగా అధికారులు నిర్ధారించడం ఒక్కటే మిగిలి ఉంది. దీంతో టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. అటు టిఆర్ఎస్ నేతలు కూడా కరీంనగర్ విజయంపై ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. మూడు రౌండ్లలో  అధికారులు ఈ ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: