ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళం పాడేందుకు సిద్ధమైన దశలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ తెరలేసింది. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ పనిని పూర్తిగా ముగించేసిన రీతిలోనే ఏపీలో కూడా జరగబోతోందా.... అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉద్భవించింది. మరీ ముఖ్యంగా తన సొంత పార్టీ నేతల నుంచే కోణంలో చర్చ మొదన నేపథ్యంలో చంద్రబాబు రాబోయే రోజుల్లో తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదురుకోనటువంటి గడ్డు పరిస్థితిని చవిచూసే పరిస్థితి ఏర్పడనుంది అని అందరి మాట.

 

టిడిపికి ఉన్న ఒకే ఒక ఆసరా అయిన మండలికి మంగళం పాడేస్తే.... బాబు దగ్గర ఉన్న ఎమ్మెల్సీలు మొత్తం అడ్రస్ లేకుండా పోతారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన బిల్లు అయినా పథకమైనా.. జగన్ ఎటువంటి ఆటంకం లేకుండా అమలు పరచుకోవచ్చు. ఇదే విధంగా కెసిఆర్ కూడా తెలంగాణలో కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని సరైన వ్యూహాలు రచించి.. చివరికి కాంగ్రెస్ ను నేలమట్టం చేశాడు. అతని మిత్రుడు బాట లోనే జగన్ కూడా ఇప్పుడు వెళ్ళబోతున్నట్లు అందరికీ అర్థమవుతుంది.

 

జగన్ కనుక వికేంద్రీకరణ బిల్లును విజయవంతంగా పాస్ చేసుకుంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అతనికి గ్రాఫ్ బాగా పెరిగిపోయి ఎవరూ ఊహించని రీతిలో విజయభేరి మోస్తాడు అన్నది అక్షర సత్యం. ఇప్పుడు ఇదే కోణంలో మేధావులు కూడా ఆలోచిస్తున్నది ఏంటి అంటే.. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ఎటువంటి ప్రభావం చూపకలేకపోతే ఇంక 2024 లో పోరు ఏక పక్షమే అవుతుంది కానీ తెలుగుదేశం పార్టీ కనీసం ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడిగేందుకు కూడా ఏమీ మిగలదు అని. చూద్దాం చంద్రబాబు గండం నుండి ఎలా గట్టెక్కుతాడో…!

మరింత సమాచారం తెలుసుకోండి: