జగన్ అన్యాయం చేస్తున్నాడు. నిజమే జగన్ టీడీపీ రాజకీయ నిరుద్యోగులకు చాలా అన్యాయమే చేస్తున్నాడు. తాను అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా... రాష్ట్రంలో నిరుద్యోగులు ఉండకూడదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టాడు. దీనిపై విపక్షాలు రొటీన్ గా విమర్శలు చేసినా జగన్ మాత్రం తనను నమ్ముకుని ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేసి తీరాలన్న కసితో తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగం బాగా పెంచాడు.


 ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో బాహుబలి లా తమను తాము ఊహించుకుంటున్న  కొందరు తమకు ప్రజా బలం లేకపోయినా తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారు. అయితే జగన్ అకస్మాత్తుగా కొంతమంది టిడిపి నిరుద్యోగులకు గట్టి షాక్ ఇచ్చాడు. శాసనమండలిని రద్దు చేయడం ద్వారా ప్రతిపక్ష టీడీపీలో ఈ నిరుద్యోగం బాగా పెరిగి పోయేలా కనిపిస్తోంది. పదవులను అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ , ప్రజా ఉపయోగకరమైన పథకాలను కూడా టిడిపి శాసనమండలి సభ్యులు తమ రాజకీయ కక్షలకు నిలయంగా మండలిని పావుగా వాడుకుంటున్నారనే విమర్శలపై జగన్ లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు.


 ఈ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీ లోనే కాకుండా అధికార పార్టీ వైసీపీ లో కొంతమంది నాయకులకు పదవులు కోల్పోయేలా కనిపిస్తోంది. జగన్ తనను నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక పదవిని కట్టబెట్టేలా చేయొచ్చు.ఆయనకు ఆ అధికారం ఉంది. కానీ ప్రతిపక్ష టీడీపీకి ఈ విషయంలో మరో ఛాన్స్ లేదు. కేవలం పార్టీ పదవులు తప్ప ప్రభుత్వ పరంగా ఈ నాలుగున్నరేళ్లలో ఏ పదవి వచ్చేలా లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు ఆందోళన కనిపిస్తోంది. పార్టీ అధికారంలో లేకపోయినా ఎమ్మెల్సీలుగా రాష్ట్రంలో తమ హవా చూపించామని, ఇకపై జగన్ దగ్గర వారి పప్పులు ఉదకవనే బాధతో వీరంతా గగ్గోలు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: