తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.. చరిత్రలో  నిలిచిపోయేలా ప్రతిపక్ష పార్టీ కూడా చేరువ లేకుండా సంచలన విజయాన్ని నమోదు చేసింది . మున్సిపల్ ఎన్నికలు జరిగింది అన్ని పార్టీలకు కాదు ఒక టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే అన్నట్లుగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు నిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 90 శాతానికి పైగా విజయం సాధించింది తెరాస . మరోసారి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి ఎదురు లేదు అని నిరూపించింది. కార్ స్పీడ్కు బ్రేకులు వేసే పార్టీ లేకపోయింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం పై తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. 

 

 

 మున్సిపల్ ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించిన అందరికీ అభినందనలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రవ్యాప్తంగా 119 మున్సిపాలిటీల్లో  టిఆర్ఎస్ జెండా ఎగిరింది అంటూ తెలిపారు. కాగా  ఈ రోజు చైర్మన్ ఉప  చైర్మన్, మేయర్ ఉప  మేయర్ కౌన్సిలర్లు కార్పొరేటర్ల ఎన్నిక జరిగిందని... పలు చోట్ల మాత్రం రేపటికి కార్పొరేషన్ చైర్మన్ ఎన్నిక వాయిదా కేటీఆర్ తెలిపారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మేయర్లు, ఉప మేయర్లు,  చైర్మన్లు డిప్యూటీ చైర్మన్ కౌన్సిలర్ గా ఎన్నికైన వారందరికీ కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ప్రభుత్వం శిక్షణ తరగతులు ఇస్తుందని తెలిపారు. 

 

 

 అయితే రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి 1037 కోట్ల నిధులు ప్రతి సంవత్సరం వస్తాయని.అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 1037 కోట్ల నిధులు వస్తాయని తెలిపారు . ప్రతినెల వంద కోట్లకు పైగా నిధులు మున్సిపాలిటీ ఖాతాలో జమ అవుతాయి అంటూ కేటీఆర్ తెలిపారు. ఇకపోతే ఒక ప్రాంతీయ పార్టీని ఓడించటానికి  రెండు జాతీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు. జాతీయ పార్టీలు పొత్తు పెట్టుకున్న టిఆర్ఎస్ పార్టీని ఏం చేయలేక పోయాయి అని తెలిపారు.పేరుకేమో జాతీయ పార్టీలు చేసేవేమో పిచ్చి పనులు అంటూ వ్యాఖ్యానించారు.  కేవలం జాతీయ పార్టీలు పొత్తు పెట్టుకుని ఏడు మున్సిపాలిటీలో మాత్రమే విజయం సాధించాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: