జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి జడ్జి గా నాగబాబు తనదైన స్టైల్లో షో ని  ముందుకు తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. సరికొత్త నాగబాబు ను ప్రేక్షకులకు పరిచయం చేస్తు.. జబర్దస్త్ కామెడీ షోని  తన నవ్వులతోనే షో కి ఎంతో పాపులారిటీ తీసుకొచ్చారు. ఇక కమెడియన్స్ అందరిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ... తప్పొప్పులు  తెలియజేస్తూ జబర్దస్త్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయారు నాగబాబు. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జడ్జి గా  కొనసాగిన నాగబాబు గత కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ నుండి నాగబాబు తప్పుకోవడం సంచలనంగా మారింది కూడా. 

 

 

 ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ కమెడియన్ లలో బాగా పాపులర్ అయిన అప్పారావు నాగబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ కామెడీ షో కి నాగబాబు గారు ఒక నిండు తనాన్ని తీసుకొచ్చారు అంటూ తెలిపారు కమీడియాన్  అప్పారావు. జబర్దస్త్ కామెడీ షో అంటే నాగబాబు గారికి ఎంతో ఇష్టం అని తెలిపారు. అందుకే ఆ మధ్య నాగబాబు గారికి తీవ్రంగా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుటికీ  కూడా జబర్దస్త్ షోని  మాత్రం ఆయన మానుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు కమెడియన్ అప్పారావు. జబర్దస్త్ షో నాగబాబు కు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదే నిదర్శనం అని తెలిపాడు అప్పారావు. 

 

 

 అలాంటి ననాగబాబు  జబర్దస్త్ నుంచి ఎందుకు తప్పుకున్నారో  అనేది మాత్రం తనకు తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకోవడానికి పారితోషికం అంటూ గతంలో వార్తలు వచ్చినప్పటికీ.. ఆయన జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి గల కారణం పారితోషకం కాదని స్వయంగా నాగబాబు గారే  స్పష్టం చేశారు అంటూ తెలిపారు  అప్పారావు. కాబట్టి పారితోషకం వైపు నుంచి ఎలాంటి సందేహం లేనట్టే. ఏదేమైనా జబర్దస్త్ కామెడీ షో నుంచి జడ్జిగా నాగబాబు తప్పుకోవటం  ఎంతో బాధ అనిపించింది  అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: