ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క ఘన చరిత్ర గురించి మనందరికీ తెలిసిందే. తాను అనుకుంటే అది ఎంత కష్టమైన పనినైనా దానివల్ల ప్రజాశ్రేయస్సు జరుగుతుంది ని అతను తలిస్తే వెనుదిరిగి చూడని వ్యక్తిత్వం వైయస్సార్ ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి కూడా అలాగే ఉండడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు మద్దతుదారులు అంతా ముఖ్యమంత్రి జగన్ ను చూసి మురిసిపోతున్నారు.

 

అయితే ఇప్పటికీ వైయస్సార్ చరిష్మా ను కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన తండ్రి ఏర్పాటు చేసిన రాష్ట్ర శాసనమండలిని జగన్ చివరికి రద్దు చేసే దిశగా కీలక ముందడుగు వేశాడు

 

ఏపీలో శాసనమండలి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. శాసనసభ సైతం మేరకు తీర్మానం ఆమోదించనుంది. మండలిలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను తమ అభ్యంతరాలకు విలువ ఇవ్వకుండా..టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం సెలెక్ట్ కమిటీకి పంపారనేది వైసీపీ నేతల ఆగ్రహం. దీంతో..న్యాయ పరంగా సీఎం జగన్ నిపుణులతో చర్చలు చేసారు. అదే విధంగా మంత్రులు..పార్టీ ప్రముఖులతో చర్చించారు.

 

అయితే జగన్ ఏమిటి తండ్రి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు అని అందరికీ సందేహం రావచ్చు. రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ రద్దు చేసిన మండలిని తిరిగి తీసుకొని వచ్చింది.... రాష్ట్ర పాలనలో సమతుల్యత ఉండాలని.. ప్రభుత్వం ప్రజల తరఫున తీసుకునే నిర్ణయాలను అందరూ ఏకగ్రీవంగా మంచి మనసుతో మద్దతు తెలిపితే అది ప్రజలకు మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది అని. కానీ ఇప్పుడు చంద్రబాబు దానిని ఆసరాగా తీసుకుని చేస్తున్న కుట్రల రీత్యా జగన్ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: