మనిషి జీవించి ఉన్న సమయంలోనే కాదు మరణంలో కూడా గౌరవాన్ని కోరుకుంటాడనే విషయం తెలిసిందే. చట్టాలు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉంటాయి. మనిషి మరణం పొందిన తరువాత ఆ శవానికి కూడా తగిన గౌరవం ఇవ్వాలి. కానీ దేశంలోని జనాభాలో కొంతమంది అభాగ్యులుగా మరణిస్తున్నారు. కొందరు ఎవరూ లేక అభాగ్యులుగా మరణిస్తుంటే మరికొందరూ అందరూ ఉన్నప్పటికీ వారి నిరాదరణకు గురై అనాథలుగా మరణిస్తున్నారు. 
 
ఇలా నిరాదరణకు గురైన అనాథ శవాలకు ఆసరాగా నిలిచి 82 సంవత్సరాల వయస్సు గల షరీఫ్ చాచా పద్మ శ్రీ సత్కారం పొందాడు. ఎటువంటి స్వార్థం లేకుండా షరీఫ్ చాచా చేస్తున్న సేవకు కేంద్రం సముచిత స్థానాన్ని కల్పించింది. గడచిన 27 సంవత్సరాలలో షరీఫ్ చాచా ఏకంగా 25 వేల మంది అభాగ్యులకు దహన సంస్కారాలను నిర్వహించారు. దహన సంస్కారాలను నిర్వహించి మరణంలో కూడా వారికి గొప్ప గౌరవాన్ని షరీన్ చాచా ప్రసాదించారు. 
 
షరీఫ్ చాచా స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్. పెద్ద చదువులు చదవకపోవడంతో సైకిల్ మెకానిక్ గా షరీన్ చాచా స్థిరపడ్డారు. దాదాపు 28 సంవత్సరాల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత మత ఘర్షణలు జరిగాయి. ఆ మత ఘర్షణలలో షరీన్ చాచా పెద్ద కొడుకు చనిపోయాడు. తన కొడుకు చనిపోయాడని నెల రోజుల తరువాత షరీన్ చాచాకు మరియు కుటుంబ సభ్యులకు తెలిసింది. 
 
రైలు పట్టాలపై కుళ్లిపోయిన స్థితిలో కొడుకు శవం ఉండటంతో షరీన్ చాచా కన్నీరుమున్నీరయ్యారు. ఆ తరువాత తన కన్న కొడుకుకు వచ్చిన పరిస్థితి మరెవరికీ రాకూడదని షరీన్ చాచా నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలను గుర్తు తెలియని మృతదేహాలు కనిపిస్తే చేయాలని షరీన్ చాచా నిర్ణయం తీసుకున్నారు. అభాగ్యుల శవాలకు కులం, మతంతో సంబంధం లేకుండా అంత్యక్రియలను నిర్వహించాలని షరీన్ చాచా నిర్ణయం తీసుకున్నారు. అలా ఇప్పటివరకు మతంతో సంబంధం లేకుండా 25 వేల శవాలకు అంత్యక్రియలు చేశారు. తాను సంపాదించే డబ్బుతో పాటు ఇరుగు పొరుగు వారు ఇచ్చే విరాళాలతో దహన సంస్కారాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: