ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్లో హాట్ చర్చలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే..మొదటి నుండి టీడీపీ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. అయితే మింగుడు పాడనా టీడీపీ నేతలు ఏదొక విషయంలో అడ్డుకుంటూనే వస్తున్నారు. కాగా, ఎన్నికలు అవ్వడం, టీడీపీ ఓడిపోవడం ఇవన్నీ జరిగి కూడా దాదాపు ఏడూ నెలలు కాగా ఇప్పటికి టీడీపీ ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. 

 

అయితే, గతంలో అక్రమ ఆస్తుల వ్యవహారాలపై జగన్ కోర్టుకు హాజరయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై టీడీపీ కి పట్టు దొరకడంతో ఎక్కడ వెనకెడుగు వేయక మాటలతో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ టీడీపీ నేత దేవినేని ఉమా జగన్ ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఆ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతున్నాయి. 

 

ఇది ఇలా ఉండగా  రాష్ట్రంలో రౌడీ ప్రభుత్వం కొనసాగుతోందని టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. కర్ణాటక రైతుల్ని పోలీసులు అరెస్ట్‌ చేయడం దుర్మార్గమన్నారు. అమరావతోలో జరుగుతున్న రైతుల అరెస్టులు, ర్యాలీలు, మహిళలపైనా పెద్దల తీరులు బాధాకరం అంటూ దేవినేని అన్నారు. జగన్ ప్రభుత్వం ఒక రౌడీ ప్రభుత్వం అని , ప్రజల సమస్యలను తెలుసుకోవడం మానేసి జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 

 

అమరావతి రైతులకు సంఘీభావం తెలపడం నేరమా అని ప్రశ్నించారు. పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉంటూ.. మీ ధర్మాన్ని పాటించాలని సూచించారు. సీఎం జగన్‌ వచ్చే జనవరికి జైల్లో ఉంటాడని జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది జగన్‌ చర్లపల్లి జైల్లో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాడని దేవినేని ఉమ ఎద్దేవాచేశారు. నేతలను ప్రజలను సరిగ్గా చూసుకొని జగన్ పరిస్థితి అదే నంటూ వాదించాడు. ఇప్పుడు ఈ మాటలను వైసీపీ ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: